Alert: పాన్ ఆధార్ లింక్ చేసుకోండి…లేదంటే ట్రాన్సక్షన్స్ పై ఎఫెక్ట్…!

-

మనకి వుండే డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు, ఆధార్ కార్డు కూడా ముఖ్యమైనవి. అయితే గత కొన్ని నెలల నుండి ఈ రెండిటినీ లింక్ చెయ్యాలని చెబుతూనే వున్నారు. కనుక తప్పని సరిగా లింక్ చేసుకోవాలి. లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కస్టమర్స్ ని అలెర్ట్ చేస్తోంది. కోట్లాది మంది కస్టమర్స్ కి ఈ విషయాన్ని చెప్పింది స్టేట్ బ్యాంక్. ఈ ఏడాది మార్చి 31 వ తేదీ లోపు పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయాలని ఎస్‌బీఐ సూచించింది.

 

అప్పటి లోగా కనుక లింక్ చెయ్యకపోతే బ్యాంకు లావాదేవీలపై ప్రభావం చూపే అవకాశముందని చెప్పింది బ్యాంక్. కనుక లింక్ చెయ్యండి. ఎలాంటి అసౌకర్యం లేకుండా బ్యాంకింగ్ సేవలను కొనసాగించేలా తమ కస్టమర్లు ఆధార్ కార్డు తో పాన్ కార్డుని లింక్ చెయ్యమని అంది బ్యాంక్. ఒకవేళ కనుక లింక్ చెయ్యక పోతే ట్రాన్సక్షన్స్ పై ఎఫెక్ట్ పడనుంది అని చెప్పారు.

పాన్-ఆధార్ లింకింగ్ గడువును గతంలో సెప్టెంబరు 30 నుండి మార్చి 31, 2022 వరకు పొడిగించింది. లింక్ చేసుకోవాలని అనుకుంటే ఆదాయపన్ను రిటర్న్‌ల ఫైలింగ్ వెబ్‌సైట్ ద్వారా ఈజీగా లింక్ చేసుకోవచ్చు. వెబ్ సైట్‌లోకి వెళ్లి లింక్ ఆధార్ పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు మీ పాన్-ఆధార్ వివరాలు ఇచ్చి కాప్చా కోడ్ ఎంటర్ చేసి, లేదా ఓటీపీ ద్వారా లింక్ చేసుకోచ్చు. 567678/ 56161 ఎస్సెమ్మెస్ పంపి కూడా లింక్ చేసుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news