మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి..ఈ దేశ పౌరుడిగా గుర్తించే ముఖ్యమైన పత్రం ఆధార్ కార్డు.. ఎన్నో పనులుకు ఆధార్ తప్పనిసరి. రోజువారి జీవితంలో చాలా ముఖ్యమైనది ఆధార్. అయితే ఇప్పటి వరకూ ఆధార్ కార్డు పోగొట్టుకున్నా, అందులో ఏమైనా మార్పులు చేయాలన్నా..పెద్దగా శ్రమపడక్కర్లేదు.. సులభంగా చేసుకునేవాళ్లం..కానీ ఇప్పుడు ఆధార్ కార్డు అప్లై చేయడం కూడా..పాస్‌పోర్డ్ అప్లై చేసినంత కష్టం అయిపోయింది.. ఎన్నో కండీషన్స్ ఉన్నాయి.. ఆధార్ కార్డు పోగొట్టుకున్నా కూడా దాన్ని పొందడం అంత తేలికైన విషయం కాదు. దీనికి UIDAI ఒక పరిష్కారాన్ని కనిపెట్టింది. పీవీసీ ఆధార్ కార్డు కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని సిద్ధం చేశారు. PVC ఆధార్ కార్డ్‌లో QR కోడ్, హోలోగ్రామ్, పేరు, ఫోటోగ్రాఫ్, పుట్టిన తేదీ మరియు ఇతర సంబంధిత సమాచారం ఉంటుంది. 50 రుసుము చెల్లించి కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. PVC ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేయడం కూడా సులభం.
ఆధార్ PVC కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- uidai.gov.in లింక్‌ని తీసుకోండి
- గెట్ ఆధార్‌లో ‘ఆర్డర్ ఆధార్ కార్డ్’ ఎంపికపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు ఒక ప్యానల్ ఓపెన్ అవుతుంది.. అక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి.. మీ 12-అంకెల ఆధార్ కార్డ్ (UID) నంబర్ / 16-అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ (VID) నంబర్ / 28-అంకెల ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను నమోదు చేయండి. క్యాప్చా ఎంటర్ చేయండి.. ఇప్పుడు ఆధార్‌తో లింక్ అయిన ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయండి.
- ఇప్పుడు సర్వీస్ ఆప్షన్‌లో ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయండి
- మీ ఆధార్ కార్డు డీటెల్స్ అన్నీ అక్కడ వస్తాయి.. అవి సరైనవా కాదా అని తనిఖీ చేయండి..
- ‘నిబంధనలు మరియు షరతులు’ బాక్స్ మీద క్లిక్ చేసి నెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయండి
- ఇక్కడ పేమెంట్ చేయాలి.. క్రెడిట్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా రూ.50 చెల్లించాలి.
- సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ SMS రూపంలో అందుతుంది. స్క్రీన్‌పై డిజిటల్ సంతకంతో రసీదుని కూడా పొందండి.
- రసీదుని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయండి.
- అంతే వారం పదిరోజుల్లో మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్‌కు పీవీసీ కార్డు పోస్ట్ ద్వారా వచ్చేస్తుంది.