LTC cash voucher: కేంద్రం కీలక నిర్ణయం… ఉద్యోగులకు ఊరట…!

-

తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కన్సిషన్ వోచర్ (LTC Voucher) ఎల్‌టీసీ వోచర్ స్కీమ్‌పై పన్ను మినహాయింపు ఉన్నట్టు బడ్జెట్‌లో చెప్పారు. దీనితో ఉద్యోగులకి ఊరట కలగనుంది. ఎల్‌టీసీ స్కీమ్ ఎంచుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్ను బాదుడు ఉండదు. ఉద్యోగులు ఎల్‌టీసీ స్కీమ్ వలన ట్రావెల్ అలవెన్స్ కింద డబ్బులని పొందవచ్చు. దీని వల్ల కలిగే ప్రధాన ఉపయోగం ఏమిటంటే..? దీని పై  పడదు.

ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇది ఇలా ఉండగా ఈ స్కీమ్‌ను గతేడాది అక్టోబర్ 12 ప్రకటించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి వలన కలిగే ఇబ్బందుల నుండి ఊరట కల్పించాలనే లక్ష్యం తో కేంద్రం ఈ స్కీమ్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తో పాటు ప్రైవేట్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దీని మూలంగా బెనిఫిట్స్ కలుగుతాయి. అయితే ఎల్‌టీసీ వోచర్ స్కీమ్ బెనిఫిట్స్ పొందాలని భావిస్తే కొన్ని నిబంధనలు ఉంటాయి గుర్తుంచుకోండి.

12 శాతం లేదా ఆపైన జీఎస్‌టీ వర్తించే ప్రొడక్టులని మీరు కొనుగోలు చేస్తే ఎల్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ వర్తిస్తుంది. ఇది ఇలా ఉండగా మార్చి 31 వరకే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది గమనించండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే డిజిటల్ లావాదేవీలు మాత్రమే నిర్వహించాలి. ట్రావెల్ అలవెన్స్‌కు మూడు రెట్లు ఖర్చు చేయాలి. అలానే తప్పని సరిగా ఎల్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ కోసం జీఎస్‌టీ రశీదులు ఇవ్వాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news