పంచాయతీ ఎన్నికల పోలింగ్ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని పెంచుతూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. పెంచిన సమయం ప్రకారం ఉదయం ఆరున్నర నుంచి మూడున్నర వరకు పోలింగ్ జరుగనుంది. కోవిడ్ నేపథ్యంలో సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని ఎస్ఈసీ వెల్లడించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 కే పోలింగ్ ముగియనున్నది.
ఈ మేరకు ఎస్ఈసీ కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. ఇక పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఈ నెల 9, 13,17,21 తేదీల్లో సెలవులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఆయా తేదీల్లో ఎక్కెడక్కడ పోలింగ్ జరుగుతుందో ఆ ప్రాంతాల్లో శెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దుకాణాలకు సెలవులు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వ భవనాలను పోలింగ్ కేంద్రాలుగా వినియోగించుకునేందుకు సెలవులు ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.