ఈ బ్యాంకులో ఖాతా తెరిస్తే మహిళలకు పలు బెనిఫిట్స్..!

-

ఒక బ్యాంకు మహిళల కోసం ప్రత్యేక సర్వీసులు అందిస్తోంది. రుణాలపై వడ్డీ రేట్లలో అదనపు తగ్గింపు ప్రయోజనాన్ని కల్పిస్తోంది. ప్రత్యేకమైన సేవింగ్స్ అకౌంట్ సర్వీసు ద్వారా ఈ ఆఫర్ ను అందిస్తోంది. ఈ బ్యాంక్ లో అకౌంట్ తెరవడం ద్వారా పలు రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఈ బ్యాంక్ పేరు ఇవా.

money
money

ఇప్పటికే కొన్ని బ్యాంకులు మహిళల కోసం రుణాలపై వడ్డీ రేట్లలో అదనపు తగ్గింపు ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. దేశీయ రెండో అతిపెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈక్విటిస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ ప్రత్యేకమైన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ను ఆఫర్ చేస్తోంది. ఈ బ్యాంకులో ఖాతా తెరిచిన వారికి తక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. కేవలం 7 శాతం వడ్డీని అందిస్తోంది. దీనితోపాటు పలు బెనిఫిట్స్ ను కూడా అందిస్తోంది.

మహిళలకు ఉచితంగా హెల్త్ చెకప్, మహిళా డాక్టర్లతో ఫోన్ లో మాట్లాడే సదుపాయం వంటి ఆరోగ్య సంబంధమైన ప్రయోజనాలను కూడా కల్పిస్తోంది. ఉద్యోగం, వ్యాపారంలో రాణించాలనుకునే మహిళలకు ఆర్థికంగా సాయం చేయడం జరుగుతుంది. సీనియర్స్ సిటిజన్స్, గృహిణుల కోసం పలు రకాల బెనిఫిట్స్ అందిస్తోంది. మహిళలు ఎవరైనా సరే బ్యాంకుకు వెళ్లి ఈజీగా ఖాతా తెరుచుకోవచ్చు. పలు రకాల డిస్కౌంట్ తో పాటు లాకర్లపై 25 నుంచి 50 శాతం వరకు చార్జీల తగ్గింపు కూడా అందిస్తోంది.

వీటితోపాటు గోల్డ్ లోన్స్ పై వడ్డీ రేట్లలో భారీ తగ్గింపు కూడా లభిస్తోంది. బ్యాంకు ఖాతాను మెయిన్ టెన్ చేయడానికి అదనపు చార్జీలు కూడా పడవు. ఒక వేళ మీరు బ్యాంక్ డెబిట్ ద్వారా షాపింగ్ చేయాలనుకుంటే మీకు రివార్డు పాయింట్లు కూడా దక్కుతాయి. ఈ బ్యాంకు ఖాతాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇవా పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ బ్యాంక్ ఇండియన్ మహిళా క్రికెటర్ స్మృతి మందనాతో ఒప్పందం కుదర్చుకున్నారు. బ్యాంక్ కు సంబంధించిన బెనిఫిట్స్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్మృతి మందనాను ప్రమోటర్ గా ఎంపిక చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news