అదిరిపోయే గోల్డ్‌ స్కీం.. కేవలం రూ.100

గోల్డ్‌ స్కీంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకునేవారికి ఇది శుభవార్తే! సాధరణంగా మనం అధిక డబ్బును సంపాదించడానికి పెట్టుబడులు పెడతాం. పెట్టుబడులకు అనేక మార్గాలు ఉన్నాయి. అందులో బంగారం కూడా ఒక పెట్టుబడికి మంచి మార్గం. ఎందుకంటే బంగారం రేటు పెరుగుతూ ఉంటుంది. దీంతో మనం ఎక్కువ డబ్బులను భవిష్యత్తులో ఆర్జించవచ్చు. బంగారం గోల్డ్‌ ఈటీఎఫ్, గోల్డ్‌ బాండ్స్‌ రూపంలో కొనుగోలు చేస్తాం.

అయితే గోల్డ్‌ స్కీంలు కూడా వివిధ ప్రముఖ జువెలరీ సంస్థలు ప్రవేశపెట్టాయి. బంగారం ఒకేసారి కొనలేని వారికి ఈ గోల్డ్‌ స్కీంలో ఇన్వెస్ట్‌ చేసుకుని కొంటారు. సాధరణంగా రూ.500 ధరకు జీఆర్‌టీ జువేలర్స్‌ అందిస్తోంది బంగారం పథకం. ఇప్పటి వరకు ఇదే అతి చిన్న బంగారం పథకం అనుకున్నాం. కానీ, ఈ రికార్డుకు బ్రేక్‌ పడింది. తాజాగా మైక్రో సేవింగ్స్‌ ఫిన్‌టెక్‌ సిప్లీ గ్యారెంటీడ్‌ గోల్డ్‌ సేవింగ్స్‌ పథకం ద్వారా మీకోసం ఒక అదిరిపోయే ఆఫర్‌ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మీరు కేవలం రూ.100 కే స్కీమ్‌లో చేరవచ్చు. పేద, మధ్యతరగతి ఇలా ప్రతి ఒక్కరికీ ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి సులభతరం చేసేందుకే ఈ స్కీం ను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ తెలిపింది.

ఈ పథకంలో చేరాలనుకుంటే వారానికి రూ.100 ఇన్వెస్ట్‌ చేయాలి. ఇలా మూడు నెలలు కట్టాక 10 శాతం బోనస్‌ వస్తుంది. దీనికి 24 కేరట్ల బంగారం పొందవచ్చు.
మీరు ఈ పథకంలో చేరాలనుకుంటే మీరు కంపెనీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలి. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఫిన్‌టెక్‌ సిప్లీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వీటికి ఎటువంటి అదనపు డాక్యుమెంట్లు అందించాల్సిన అవసరం లేదు. గోల్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లొచ్చు. ఈ యాప్‌ను ఇప్పటికే 80 వేల మంది యూజర్లు డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు.