హైదరాబాద్ లో ఎక్కువ ఇళ్ల అమ్మకాలు పెరిగాయి: స్టడీ..!

-

భారతదేశంలో ఎనిమిది ముఖ్యమైన పట్టణాలలో హైదరాబాద్ లో చాలా మటుకు హౌసింగ్ సేల్స్ ఎక్కువైనట్లు తెలుస్తోంది. సంవత్సరం సంవత్సరానికి దీని యొక్క అభివృద్ధి 39 శాతం గా పెరుగుతున్నట్టు తేలింది.

జనవరి నుండి మార్చి నెలలో కరోనా వైరస్ మహమ్మారి ఉన్నప్పటికీ హౌసింగ్ సేల్స్ పెరగడం గమనార్హం. రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం హైటెక్ సిటీ హైదరాబాద్ ఇరవై ఐదు నెలల నుంచి చూసుకుంటే ఇంటి కొనుగోలు ఎక్కువయ్యాయి.

గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా హౌసింగ్ సేల్స్ ఎక్కువ అవ్వడం మనం చూస్తున్నాం. ఇంటి సేల్స్, లాంచ్ లాంటివి కూడా ఎక్కువ అయ్యాయి. ఈ ట్రెండ్ 2021 లో వచ్చిందని. ఈ ఏడాది మొదటి క్వార్టర్లో 39% హౌసింగ్ సేల్స్ పెరిగాయని.. దీనితో 7,721 యూనిట్లు జనవరి మార్చ్ లో ఉండగా… 5,554 ఇల్లులు 2020 ఫస్ట్ క్వార్ట్రర్ లో అమ్మడం జరిగింది.

ముఖ్యంగా సంగారెడ్డి, బచ్చుపల్లి, కొంపల్లి ఏరియాల్లో సేల్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో 95 శాతం కొత్త హౌసులు పెరిగాయి. 2021 ఫస్ట్ క్వార్టర్ లో 7,604 యూనిట్లు ఉన్నట్లు తెలియగ ఎక్కువగా నల్లగండ్ల మరియు కొంపల్లి ఏరియాలో అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news