మ్యూచువల్ ఫండ్స్: సిప్ గురించి మీకు తెలియని విషయాలివే..

-

ప్రస్తుతం మార్కెట్ మంచి రైజింగ్ లో ఉంది. ఈ టైమ్ లో ఇన్వెస్ట్ చేయాలని ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ఐతే ఎందులో ఇన్వెస్ట్ చేయాలనే దానిలో అనేక సందేహాలు కలుగుతున్నాయి. మ్యూచువల్ ఫండ్లు అనగానే చాలా మంది భయపడుతున్నారు. దానికి కారణం స్టాక్ మార్కెట్. మార్కెట్ ఒడిదొడుకులకి అనుగుణంగా రిటర్న్స్ ఉంటాయి కాబట్టి, ఆ మాత్రం భయం ఖచ్చితంగా ఉంటుంది. మార్కెట్ ఒడిదొడుకులు ఉన్నప్పటికీ మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసే ప్రోడక్టుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

సిప్

సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్.. నెల నెలా కొంత మేర అమౌంట్ ని మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడమే సిప్. దీనివల్ల చాలా ప్రయోజనాలున్నాయి.

ముందుగా, సిప్ చేయడానికి పెద్ద అమౌంట్ కావాల్సిన అవసరం లేదు. వెయ్యి రూపాయలతోనైనా పెట్టుబడి మొదలు పెట్టవచ్చు. స్మాల్, మిడ్, లార్జ్ సహా అన్ని ఫండ్లలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.

సిప్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఏదైనా ప్రత్యేక గమ్యం కోసం పెట్టుబడి పెడితే మంచిది. రిటైర్ మెంట్ ప్లాన్ కోసమో, పిల్లల పై చదువుల కోసమో, ఇల్లు కట్టుకుందామన్న ఉద్దేశ్యమో అయితే బాగుంటుంది. ఎందుకంటే, సిప్ లో పెట్టుబడి, దీర్ఘకాల ఫలితాలకి బాగుంటుంది. దీర్ఘకాలంలో మార్కెట్ రిస్క్ దాదాపుగా ఉండదు.

సిప్ చేస్తే రూపీ కాస్ట్ యావరేజ్ వర్కౌట్ అవుతుంది. మార్కెట్ విలువ ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి, రూపీ కాస్ట్ యావరేజ్ వర్కౌట్ అయ్యి, ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుంది.

ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news