మనదేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.మనకు మన ఓటుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి రకరకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే మరో కొత్త యాప్‌ను కూడా పరిచయం చేసింది డెమోక్రాటికా అనే కంపెనీ బోల్ సుబోల్ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌లో ఎన్నికల వివరాలు, మనదేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. దీని కారణంగా ఓటర్లు నిజాలు తెలుసుకుని, తమకు కావాల్సిన నాయకులను ఎంచుకోవడానికి ఇది సరైన పద్ధతి. సులభంగా ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఇది వీలు పడుతుంది. అలాగే ఈ యాప్ ద్వారా మీకు కావాల్సిన స్పష్టత వస్తుందని సంస్థ అధికారులు తెలిపారు.
ఈ యాప్‌లో దేశంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన 60 ఏళ్ల సమాచారం పొందుపర చామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఓటర్లకు అవగాహన కల్పించడానికి తమవంతు కృషి చేస్తోందని, ఈ యాప్ ఒక శక్తిమంతమైన మైక్రోబ్లాగింగ్ టూల్‌గా పనిచేయనుందని సంస్థ డైరెక్టర్ రితేష్ వర్మ తెలిపారు.
మనదేశంలోని అన్ని పనులను సాధ్యమైనంతవరకు డిజిటల్ ప్లాట్‌ఫాంలన్నీ సోషల్ నెట్ వర్కింగ్ అప్లికేషన్లతో లింక్ అయి ఉన్నాయని పేర్కొన్నారు. ఇదివరకే ఉన్న యాప్‌ల కంటే ఇది అప్‌డేటెడ్ అని డైరెక్టర్ అన్నారు. ఈ బోల్‌సుబోల్ యాప్ ద్వారా వినియోగదారులు ఒకవైపు గేమ్ ఆడుతూ కూడా మరోవైపు ఎన్నికలకు సంబంధించిన సమాచారన్ని తెలుసుకోవచ్చని, యాప్‌లో ఎన్నో ఫీచర్లను ఉచితంగా పొందవచ్చని తెలిపారు. అయితే కొన్ని ఫీచర్లను ఉపయోగించడానికి మాత్రం వినియోగదారులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అసోంలో మార్చి 27వ తేదీ నుంచి ఎన్నికలు జరగనున్నాయి. మనదేశంలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 2వ తేదీన జరగనుంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయని తెలిసిందే. కాబట్టి ఈ యాప్ ఓటర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.