కేంద్రం: కార్మికుల కోసం నూతన జాబ్ పోర్టల్..!

-

ఒక మంచి నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఎంతో మందికి ఉపయోగ పడేలా ప్రభుత్వం ఓ నూతన జాబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. దీనితో దేశవ్యాప్తంగా 10 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. అయితే ఉద్యోగం పొందేటప్పుడు ఏ మధ్యవర్తులు, కాంట్రాక్టర్లతో సంబంధం ఉండదు. కాబట్టి డైరెక్ట్ గా ఎంఎస్ఎంఇలతో అనుసంధానం అవ్వొచ్చంది.

job portal
 

ఈ నూతన జాబ్ పోర్టుల సాక్షమ్‌ లో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ పరిధి లోని టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్‌మెంట్ కౌన్సిల్ (టిఫాక్), ఎంఎస్‌ఎంఇల అవసరాలకు అనుగుణంగా కార్మికులకు స్కిల్స్ మ్యాపింగ్‌ను నిర్వహించడానికి కూడా దేనితో వీలు అవుతుంది అన్నారు. ఈ సర్వీసు ద్వారా కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకోవడానికి కూడా వీలు అవుతుంది.

స్కిల్స్ ని ఇది గుర్తిస్తుంది అని టిఫాక్(TIFAC) తెలిపింది. ఇక పోర్టల్ కో సంబంధించి వివరాలని చూస్తే… సాక్షమ్ నేరుగా కార్మికులను ఎంఎస్‌ఎంఇలతో అనుసంధానం చేస్తుంది. అలానే నైపుణ్యం గుర్తించాక వారికి స్కిల్ కార్డులు ఇస్తుంది. వాటి ద్వారా తమ సమీప ప్రాంతాల్లోని MSMEలలో కార్మికులు సులభంగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

అంతే కాదండి దేశ వ్యాప్తంగా ఎంఎస్‌ఎంఇల అవసరాలకు అనుగుణంగా సాక్షమ్ జాబ్ పోర్టల్ కార్మికులకు స్కిల్స్ మ్యాపింగ్‌ను ఇవ్వడం జరుగుతుంది. దీని వలన ఒత్తిడి లేకుండా కార్మికులు ఉద్యోగాన్ని పొందగలరు. ఈ వెబ్ పోర్టల్ వల్ల ఇప్పటికే అనేక స్టార్టప్‌లు కూడా మొదలు పెట్టారు. యువత వారి స్వంత స్టార్టప్‌లు నెలకొల్పేందుకు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తామని డిఎస్‌టి కార్యదర్శి అశుతోష్ శర్మ అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news