రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ట్రైన్లలో ఇక్యాటింగ్ సర్వీసులకు అంగీకారం తెలిపింది. దీనితో మీరు ఇప్పుడు నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ ఇవ్వొచ్చు. జర్నీ చేసేటప్పుడు కూడా మీకు నచ్చిన ఫుడ్ ని తినొచ్చచు. సాధ్యత, సిబ్బంది లభ్యత, స్థానిక పరిమితుల పై ఆధారపడి సేవలను మళ్లీ ప్రారంభింస్తామని ఇండియన్ రైల్వేస్ తెలిపింది. దీనితో ప్రయాణికులకు కూడా ఊరట లభించింది. రెల్రెస్ట్రో సీఈవో, ఫౌండర్ మనీశ్ చంద్ర రైల్వే శాఖ, ఐఆర్సీటీసీ అధికారులకు లేఖ రాసిన నేపథ్యంలో ఇక్యాటరింగ్కు సంబంధించిన ప్రకటన వెలువడగం గమనార్హం.
మీరు కనుక ఫుడ్ ని ఆర్డర్ చెయ్యాలనుంటే.. ailRRestro యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ చేయొచ్చు. అలానే మీ పీఎన్ఆర్ నెంబర్, ట్రైన్ పేరు, సీటు వివరాలు వంటివి కూడా ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది. ఇలా చేసి ఫుడ్ ని ఎంతో సులువుగా ఆర్డర్ ఇవ్వొచ్చు. ఐఆర్సీటీసీ గతం లోనే ఈ ఇక్యాటరింగ్ సర్వీసులు అందుబాటు లోకి తెచ్చింది.