గ్యాస్ సిలిండర్ పై పేటీఎంలో రూ.900 క్యాష్‌బ్యాక్ పొందండి..!

-

రోజు రోజుకి గ్యాస్ సిలిండర్ ధరలు బాగా పెరిగిపోతున్నాయి. మనం ఈ సంవత్సరం జనవరి నుండి చూసుకున్నట్టయితే గ్యాస్ సిలిండర్ ధర మొత్తం రూ.190.5 పెరిగింది. అంటే సుమారు రూ.200 ధర ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం అయితే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే రూ.937 చెల్లించాలి. అయితే నిజంగా ఇంత మొత్తం చెల్లించాలంటే సామాన్యులకి ఎంత కష్టమో కదా..!

Gas.jpg
Gas.jpg

అయితే సామాన్యులకు భారం అవుతున్న సమయంలో పేటీఎం అద్భుతమైన ఆఫర్ ని ఒకటి ఇచ్చింది. పేటీఎం యాప్‌లో కనుక సిలండర్ ని బుక్ చేసుకున్నారు అంటే రూ.900 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇలా ఒక్కసారి మాత్రమే కాదు మూడు నెలల పాటు క్యాష్‌బ్యాక్ ని పొందొచ్చు.

దీనితో మీరు రూ.2,700 వరకు ఆదా చేసుకోవచ్చు. ‘3 పే 2700 క్యాష్‌బ్యాక్ ఆఫర్’ పేరుతో ఈ ఆఫర్ అందిస్తోంది పేటీఎం. అయితే ఖచ్చితంగా రూ.900 క్యాష్‌బ్యాక్ వస్తుందని చెప్పలేం. రూ.900 లోపు ఎంతైనా వస్తుంది. ఇండేన్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్ కస్టమర్లు పేటీఎంలో ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందొచ్చు. ఇక ఎలా బుక్ చెయ్యాలి అనేది చూస్తే..

దీని కోసం ముందుగా పేటీఎం యాప్ ఓపెన్ చేయాలి.
నెక్స్ట్ హోమ్ స్క్రీన్‌లో Book Gas Cylinder మీద క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మీ గ్యాస్ ఏజెన్సీతో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ లేదా ఎల్‌పీజీ ఐడీ లేదా కన్స్యూమర్  నెంబర్ ని ఎంటర్ చెయ్యండి.
అక్కడ సెర్చ్ చేస్తే మీ వివరాలు చూడచ్చు.
మీ వివరాలు కన్ఫామ్ చేసుకొని బుకింగ్ పైన క్లిక్ చేయాలి.
ఇప్పుడు పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేయాలి. పేటీఎం వ్యాలెట్, పేటీఎం యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. కావాలంటే పేటీఎం పోస్ట్‌పెయిడ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
సిలెండర్ బుక్ అవుతుంది. స్క్రాచ్ కార్డ్ స్క్రాచ్ చేస్తే క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news