గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌పై రూ.900 క్యాష్‌బ్యాక్‌.. ఒక్కసారి కాదు…!

-

గ్యాస్‌ సిలిండర్‌ ( Gas Cylinder ) బుకింగ్‌పై రూ.900 క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. ఈ ఆఫర్‌ను కేవలం ఒక్కసారి కాదు, మూడుసార్లు ఆఫర్‌ పొందండి. సిలిండర్‌ బుక్‌ చేసి రూ.900 క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. ఆఫర్‌ వివరాలు తెలుసుకుందాం. ఒకవైపు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరిగిపోయాయి. మరోవైపు సబ్సిడీ కూడా అంతంతమాత్రంగానే వస్తోంది.

 

gas cylinder | గ్యాస్‌ సిలిండర్‌
gas cylinder | గ్యాస్‌ సిలిండర్‌

దీంతో సామాన్యులకు గ్యాస్‌ బండ ఓ గుదిబండలా మారింది. అయితే, ఈ సమయంలో పేటీఎం అద్భుతమైన ఆఫర్‌ ప్రకటించింది. దీంతో గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసేవారికి రూ.900 వరకు క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఇలా ఒక్కసారి కాదు… వరుసగా మూడు నెలలు రూ.900 చొప్పున క్యాష్‌బ్యాక్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే, మొత్తం రూ.2700 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. ‘3 పే 2700 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌’ పేరుతో ఈ ఆఫర్‌ ప్రకటించింది పేటీఎం.ఈ ఆఫర్‌ను ఇండేన్, హెచ్‌పీ గ్యాస్, భారత్‌ గ్యాస్‌ యూజర్లు ఈ ఆఫర్‌ పొందొచ్చు. గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసి రూ.900 క్యాష్‌బ్యాక్‌ పొందడమే కాకుండా.. డబ్బులు లేకున్నా.. గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేయొచ్చు. తర్వాతి నెలలో గ్యాస్‌ సిలిండర్‌ డబ్బులు చెల్లించొచ్చు.

పేటీఎం అందిస్తున్న పేటీఎం పోస్ట్‌పెయిడ్‌ ఆఫర్‌ ద్వారా ఇది సాధ్యం. ఇక ప్రస్తుత యూజర్లు ప్రతీ బుకింగ్‌పై 5000 క్యాష్‌బ్యాక్‌ పాయింట్స్, రివార్డ్‌ పొందొచ్చు. వీటిని ప్రముఖ బ్రాండ్స్‌ అందించే అద్భుతమైన డీల్స్, గిఫ్ట్‌ వోచర్స్‌కు రీడీమ్‌ చేయొచ్చు. ఇక ఇటీవల పేటీఎం సరికొత్త ఫీచర్స్‌తో గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌ ఎక్స్‌పీరియె్సను పెంచింది. యూజర్లు సిలిండర్‌ బుక్‌ చేసిన తర్వాత ట్రాకింగ్‌ కూడా చేయొచ్చు.

పేటీఎం యాప్‌లో గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేయాలంటే ముందుగా యాప్‌ ఓపెన్‌ చేసిన తర్వాత హోమ్‌ స్క్రీన్
లో ‘బుక్‌ గ్యాస్‌ సిలిండర్‌’ను క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత గ్యాస్‌ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ లేదా ఎల్‌పీజీ నంబర్‌ నమోదు చేసి, సెర్చ్‌ చేస్తే మీ వివరాలు కనిపిస్తాయి. ఆ తర్వాత పేమెంట్‌ మోడ్‌ సెలెక్ట్‌ చేయాలి. పేటీఎం వ్యాలెట్, పేటీఎం యూపీఐ, డెబిట్‌ కార్డ్, క్రెడిట్‌ కార్డ్, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా పేమెంట్‌ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news