60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా పెన్షన్ పొందాలంటే ఇలా చెయ్యండి…!

Join Our Community
follow manalokam on social media

మీరు ప్రతీ నెల డబ్బుల్ని పొందాలనుకుంటున్నారా..? అయితే మీకు ఒక మంచి ఆప్షన్ అందుబాటులో ఉంది. దీనితో మీరు 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా పెన్షన్ పొందవచ్చు. పైగా మీరు దీని కోసం పెద్దగా వెచ్చించక్కర్లేదు కూడా. కేవలం రోజుకి రూ.7 ఆదా చేస్తే చాలు. ఇక ఈ సూపర్ స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే… అటల్ పెన్షన్ యోజన స్కీమ్ చాల ప్రయోజనం వల్ల బెనిఫిట్ కలగనుంది. అసంఘటిత రంగం లో పని చేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకు వచ్చింది.

ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే… 18 నుంచి 40 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు ఎవరైనా సరే ఈ పథకం లో చేరొచ్చు. ఇందులో చేరిన వాళ్లకి 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా కూడా పెన్షన్ వస్తుంది. మీరు చేసిన డిపాజిట్ బట్టి మీ పెన్షన్ వస్తుంది. రూ.1,000 నుంచి పెన్షన్ తీసుకోవచ్చు. రూ.2 వేలు, రూ.3000, రూ.4 వేలు, 5 వేల వరకు పెన్షన్ పొందే ఛాన్స్ ఉంది. బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ తో ఇందులో ఈజీగా చేరొచ్చు.

కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి పథకం లో చేరే ఛాన్స్ ఉంది. మీకు 18 ఏళ్ల లోనే పథకం లో చేరితే రూ.5 వేల పెన్షన్ కోసం నెలకు రూ.210 కట్టాలి. రోజుకు రూ.7 ఆదా చేస్తే చాలు. అదే మీరు నెలకి రూ.42 ఆదా చేస్తే రూ.1,000 పెన్షన్ వస్తుంది. రూ.84 కి రూ.2,000 పెన్షన్ వస్తుంది. రూ.126 కి మూడు వేలు, రూ.168 కి నాలుగు వేలు వస్తాయి.

 

TOP STORIES

ఇక నుండి 24×7 కరోనా వాక్సిన్…!

ఇప్పుడు వ్యాక్సిన్ కనుక వేయించుకోవాలి అంటే సరిగ్గా ఇదే సమయానికి వేయించుకోవాలని ఏమీ లేదు. హాస్పిటల్ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లు సమయాన్నిబట్టి షెడ్యూల్ ని...