ఈ స్కీమ్ డబ్బులు రాలేదా..? అయితే ఇలా తప్పులని సరిచేసుకోండి..!

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీములను తీసుకొస్తోంది. ఈ స్కీముల్లో కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. ఈ స్కీం వల్ల రైతులకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పటికే దేశంలో 12 కోట్ల మంది రైతులు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందుతున్నారు. ఈ స్కీం నుండి కేంద్రం ఆరు వేల రూపాయలని రైతులకు ఇస్తోంది. అయితే ఈ ఆరు వేల రూపాయలు ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతులకి అందుతాయి.

farmers
farmers

కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో అన్నదాతలకు రెండు వేల రూపాయల చొప్పున ఏడాదికి మొత్తంగా ఆరు వేల రూపాయలు ఇస్తోంది. ఇంకా రైతులు ఈ ప్రయోజనాన్ని పొందలేక పోతుంటే కచ్చితంగా వీటిని చెక్ చేసుకోవడం మంచిది. అర్హులైన రైతులకి కేంద్రం డబ్బులని రైతుల ఖాతాల్లోకి వేస్తోంది. తప్పులను ఈ స్టెప్స్ తో సరి చేసుకోండి.

ముందుగా అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్ళండి official site www.pmkisan.gov.in
అక్కడ హోమ్పేజీలో ఫార్మర్స్ కార్నర్ మీద క్లిక్ చేయండి.
ఆ తర్వాత బెనిఫిషరీ లిస్టు మీద క్లిక్ చేయండి.
రాష్ట్రం, జిల్లా, ఊరు వంటి వివరాలని సెలెక్ట్ చేసుకోండి.
రిపోర్ట్ మీద తర్వాత క్లిక్ చేయండి.
అక్కడ బెనిఫిషరీ లిస్ట్ స్క్రీన్ మీద కనబడుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి.
మీ పేరు చెక్ చేసి కన్ఫాం చేయండి.
తిరిగి హోమ్ పేజీకి వెళ్లిపోండి.
ఇప్పుడు బెనిఫిషరీ స్టేటస్ బటన్ మీద క్లిక్ చేయండి.
మీ ఆధార్ కార్డు వివరాలు లేదా ఫోన్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
ఇప్పుడు గెట్ డేట్ బటన్ మీద క్లిక్ చేయండి.
అక్కడ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ స్టేటస్ మీకు కనబడుతుంది.

ఎవరు ఈ స్కీమ్ ప్రయోజనాలని పొందలేరు..?

రాజ్యాంగ పదవుల పూర్వ మరియు ప్రస్తుత హోల్డర్లు.
మాజీ మరియు ప్రస్తుత మంత్రులు / రాష్ట్ర మంత్రులు మరియు మాజీ / ప్రస్తుత లోక్ సభ / రాజ్యసభ / రాష్ట్ర శాసనసభలు / రాష్ట్ర శాసనమండలి సభ్యులు, మాజీ మరియు ప్రస్తుత మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్లు, జిల్లా పంచాయతీల మాజీ మరియు ప్రస్తుత చైర్‌పర్సన్‌లు.
కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు / కార్యాలయాలు / విభాగాలు మరియు వారి ఫీల్డ్ యూనిట్లు, కేంద్ర లేదా రాష్ట్ర PSE లు మరియు అటాచ్డ్ ఆఫీసెస్/ ఆటోనోమస్ మరియు స్థానిక సంస్థల రెగ్యులర్ ఉద్యోగులు (మల్టీ టాస్కింగ్ సిబ్బంది మినహా) క్లాస్ IV / గ్రూప్ D ఉద్యోగులు).
రూ. 10,000 /- లేదా అంతకన్నా ఎక్కువ పెన్షన్ వస్తే (మల్టీ టాస్కింగ్ సిబ్బంది / క్లాస్ IV / గ్రూప్ D ఉద్యోగులు మినహా).
గత సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వారు.
వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు ఆర్కిటెక్ట్‌లు వంటి ప్రొఫెషనల్స్.