పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు పొందాలనుకుంటున్నారా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి…!

Join Our Community
follow manalokam on social media

పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు మీరు తీసుకోవాలి అని అనుకున్నారా..? అయితే మీరు ఇలా చెయ్యండి. దీనితో మీరు డబ్బులు పొందడానికి అవకాశం ఉంది. వచ్చే విడత డబ్బులు పొందాలని అనుకునే వాళ్ళు ఒక పని చేయాలి. దీని కోసం మీరు పొలం మీ పేరు పై ఉండేలా చూసుకోండి. అలా లేదంటే డబ్బులు రాకపోవచ్చు గమనించండి.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ ని మోదీ సర్కార్ తీసుకు వచ్చిన సంగతి తెలిసినదే. ఇప్పటికే ఎంతో మంది రైతులు దీని వలన బెనిఫిట్ పొందుతున్నారు. ప్రతి ఏడాది రైతులకి దీని వల్ల రూ.6 వేలు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు 7 విడతల డబ్బులు రైతులు పొందారు. ఏడాదికి మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున రైతుల బ్యాంక్ అకౌంట్ల లోకి పీఎం కిసాన్ డబ్బులు పాడడం జరుగుతోంది. అయితే కేంద్రం పాత రూల్స్ లో కొన్ని మార్పులు చేయడం జరిగింది.

దీంతో ఇప్పుడు పొలం ఎవరి పేరు పైన ఉంటే వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి. అలాగే కొత్తగా స్కీమ్‌ లో చేరే వారు ఇక పై కచ్చితంగా పొలం ప్లాట్ నెంబర్ చెప్పాల్సి ఉంటుంది. ఇంకా మీరు ఈ స్కీమ్‌లో జాయిన్ అవ్వనట్టైతే పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఫార్మర్స్ కార్నర్ లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇలా వివరాలని సబ్మిట్ చేసి జాయిన్ అవ్వొచ్చు.

 

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...