పోస్ట్ ఆఫీస్ కొత్త రూల్స్..!

-

పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల సేవలని కస్టమర్స్ కి ఇస్తోంది. అలానే పలు రకాల స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ని కూడా పోస్ట్ ఆఫీస్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే వీటిలో రికరింగ్ డిపాజిట్ RD పథకం కూడా ఒకటి. ఇది ఇలా ఉంటే పోస్టాఫీస్ తాజాగా ఈ స్కీమ్‌కు సంబంధించి కొత్త రూల్ ని తీసుకు వచ్చింది. అయితే తప్పకుండ ఆర్‌డీ స్కీమ్‌లో డబ్బులు దాచుకునే వారు ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాలి. ఇక దీని కోసం మరి ఎటువంటి ఆలస్యం లేకుండా పూర్తిగా చూసేయండి.

Postoffice
Postoffice

మాములుగా ఆర్‌డీ అకౌంట్ మెచ్యూరిటీ కాలం వచ్చేసి ఐదు సంవత్సరాలు. అయితే మరో ఐదేళ్లు ఈ స్కీమ్ గడువు ఎక్స్టెండ్ చేసుకోచ్చు. అదే విధంగా మెచ్యూరిటీ తర్వాత ఐదేళ్ల వరకు ఆర్‌డీ అకౌంట్‌ను అలానే ఎలాంటి డిపాజిట్లు లేకుండా కొనసాగించొచ్చు. ఇది ఇలా ఉంటే పోస్టాఫీస్ ఆర్‌డీ ఖాతా కలిగిన వారు 12 ఇన్‌స్టాల్‌మెంట్ల తర్వాత లోన్ కూడా పొందొచ్చు.

అయితే ఆర్‌డీ అకౌంట్‌లోని డబ్బుల్లో సగం మొత్తాన్ని రుణం కింద పొందొచ్చు. అయితే ఈ లోన్ ని ఒకసారి చెల్లించినా పరవాలేదు. లేదు అంటే నెలవారీ వాయిదాల్లో అయినా మీరు కట్టచ్చు. అయితే వడ్డీ రేటు ఆర్‌డీ వడ్డీ రేటుకు 2 శాతం ఎక్కువగా ఉంటుంది.

ఒకవేళ కనుక స్కీమ్ మెచ్యూరిటీలోగా రుణ డబ్బులు కట్టకపోతే అప్పుడు డబ్బులు కట్టిన తర్వాతనే మెచ్యూరిటీ మొత్తాన్ని అందిస్తారు. కానీ కొత్త రూల్ ప్రకారం చూస్తే లోన్ డబ్బులను ఆర్‌డీ మొత్తంలో నుంచి ఆటోమేటిక్‌గానే కట్ చేసుకొని మిగిలిన డబ్బులు చెల్లిస్తారు. మీరు చెల్లించే దాకా ఎదురు చూడడం జరగదు.

Read more RELATED
Recommended to you

Latest news