ఆధార్ కార్డుని ఇక పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చి అప్డేట్ చేస్తారు..!

మీరు మీ ఆధార్ కార్డు అప్డేట్ చేయాలనుకుంటున్నారా..? అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. ఇంటికి పోస్ట్మాన్ వచ్చి ఆధార్ కార్డుని అప్డేట్ చేయడం జరుగుతుంది. దీనితో మీ ఆధార్ కార్డుని ఎంతో ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

 

తాజాగా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ IPPB మరియు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI కలిసి ఈ సర్వీసులు తీసుకురావడం జరిగింది. దీనితో ఇప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి వీలు అవుతుంది.

అయితే ఇలా ఆధార్ కార్డ్ కి సంబంధించిన పని చేయడానికి పోస్ట్ మ్యాన్ కి ట్రైనింగ్ ఇస్తారు. దీని కోసం స్పెషల్ సాఫ్ట్వేర్ యాప్ ని క్రియేట్ చేశారు. దీని ద్వారా పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చి ఆధార్ కార్డు అప్డేట్ చేస్తారు.

IPPB మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ వెంకట రాము దీని కోసం మంగళవారం నాడు చెప్పడం జరిగింది. IPPB ప్రస్తుతం మొబైల్ అప్డేట్ సర్వీస్ ని తీసుకు వచ్చింది. త్వరలో పిల్లల ఎన్రోల్మెంట్ సర్వీస్ ని కూడా తీసుకు వస్తుందని చెబుతున్నారు.

మొబైల్ నెంబర్ ని అప్డేట్ చేయడం అంత ముఖ్యమా…?

ప్రస్తుతం ఆధార్ కార్డు చాలా అవసరం. మనకు ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్ కూడా ఎంతో ముఖ్యం. ప్రభుత్వం అందించే ఫెసిలిటీస్ ని పొందడానికి ఆధార్ కార్డు తప్పక ఉండాలి.

అలానే కొత్త సిమ్ కార్డు పొందడానికి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి, ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేయడానికి కూడా ఆధార్ కార్డు తప్పక ఉండాలి.

ఇలా వీటి కోసం ఆధార్ కార్డు ఉండి మొబైల్ నెంబర్ కూడా కచ్చితంగా లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది ఇలా ఓటీపీ ద్వారా సులువుగా ఎన్నో పనులు చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఆధార్ కార్డుని మొబైల్ నెంబర్ తో లింక్ చేసుకోవాలి.