రుణ గ్రహీతలకు RBI గుడ్ న్యూస్..!

-

రుణ గ్రహీతలకు దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియ RBI గుడ్ న్యూస్ చెప్పింది. చిన్న రుణాలకు సంబంధించి కొత్త విధానాన్ని తీసుకు రావడానికి సిద్ధం అవుతోంది ఆర్బీఐ. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

RBI/ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియ

ఆర్‌బీఐ ఇప్పటికే కొత్త ప్రతిపాదనలు తీసుకు వచ్చింది. ఎవరైనా రుణ మొత్తాన్ని ముందే చెల్లించాలని అనుకుంటే వాళ్లకి రిలీఫ్ కలిగే వార్త ఒకటి చెప్పింది. ప్రిపేమెంట్ చార్జీలను రద్దు చేయాలనే ప్రతిపాదన చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

మైక్రో ఫైనాన్స్ విభాగానికి సంబంధించి ఈ కొత్త నిబంధనలను సూచించింది. అలానే సంప్రదింపుల పత్రాన్ని జారీ చేసింది. జూలై 31 లోపు సంబంధిత వర్గాలు ఈ ప్రతిపాదనలపై తమ అభిప్రాయలు తెలియజేయ వచ్చు అని అంది.

కుటుంబ ఆదాయం ప్రాతిపదికన రుణ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఈలోపు రుణం తీసుకున్న వారు ఆ రుణ డబ్బులను ముందే చెల్లిస్తే ఎలాంటి ప్రిపేమెంట్ చార్జీలు పడవు. రుణాల పై కనీసంగా, గరిష్టంగా, మధ్యస్థంగా ఎంత వడ్డీ రేటు వసూలు చేస్తున్నాయో మైక్రో ఫైనాన్స్ కంపెనీలు వాటి వెబ్ సైట్ లో ఉండాలని కూడా చెప్పింది.

 

Read more RELATED
Recommended to you

Latest news