ఈ బ్యాంక్ కస్టమర్స్ కి ఆర్బీఐ గుడ్ న్యూస్..!

Join Our Community
follow manalokam on social media

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఈ బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. దీనికి సంబంధించి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పూర్తిగా చూస్తే…యూత్ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త తీసుకు వచ్చింది. బ్యాంక్‌ పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ తెలియజేయడం జరిగింది.

 

అయితే కోలాపూర్ కేంద్రంగా యూత్ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది ఇలా ఉంటే రిజర్వు బ్యాంక్ యూత్ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ బ్యాంక్‌ పై 2019 జనవరి లో ఆంక్షలు విధించింది. ఏది ఏమైనా ఆర్‌బీఐ తాజాగా తీసుకున్న నిర్ణయం తో బ్యాంక్ కస్టమర్లకు రిలీఫ్ గా వుంది.

యూత్ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై పలు ఆంక్షలు విధించింది. ఆ బ్యాంక్ ఆర్ధిక పరిస్థితులు సరిగా లేక పోవడం తో విత్‌డ్రాయెల్ లిమిట్‌ను రూ.5,000గా నిర్ణయించింది. ఫస్ట్ ఆరు నెలలు ఇలా ఉన్నాక ఆ తరువాత ఎక్స్టెండ్ చేసింది.

తాజాగా యూత్ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరం గానే ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది. దీనితో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నామని పేర్కొంది. యధావిధిగా సేవలు ఇప్పుడు కొనసాగుతాయి.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...