ఈ బ్యాంక్ కి షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. వెయ్యికి మించి డబ్బులు పొందలేరు..!

-

తాజాగా రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో కస్టమర్స్ కి నెగటివ్ ఎఫెక్ట్ పడనుంది.
ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI మరో బ్యాంక్‌కు ఝలక్ ఇచ్చింది. కఠినమైన రూల్స్ ని లక్ష్మీ కో ఆపరేటివ్ బ్యాంక్‌ పై పెట్టింది.

దీని వలన బ్యాంక్ కస్టమర్స్ కి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఈ బ్యాంక్ కస్టమర్స్ బ్యాంక్‌ లో ఎంత డబ్బున్నా తీసుకోవడానికి అవ్వదు కూడా. లక్ష్మీ కో ఆపరేటివ్ బ్యాంక్‌ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనితో బ్యాంక్ కస్టమర్లు కేవలం రూ.1000 మాత్రమే విత్‌ డ్రా చేసుకోవడానికి అవుతుంది.

అంత కంటే ఎక్కువ తీసుకోవడానికి వీలు కాదు. ఇది కస్టమర్స్ కి ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ రూల్స్ ఆరు నెలలు అమలు లో ఉంటాయి. అదే కాకుండా బ్యాంక్ కస్టమర్లకు రుణాలు ఇవ్వడం కూడా అవ్వదు. కనుక లోన్ తీసుకోవాలని అనుకున్నా సరే అవ్వదు. డిపాజిట్లను కూడా స్వీకరించదు. కనుక ఈ కొత్త లక్ష్మీ కో ఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్స్ గమనించాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news