RBI: చిరిగిపోయిన కరెన్సీ నోట్లను ఇలా మార్చుకోండి…!

-

మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు చిరిగిపోయాయా..? అయితే ఇలా మార్చుకోండి. తాజాగా నలిగిపోయిన, పాతబడిన, చిరిగిపోయిన కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. ఇక నోట్లు ఉంటే బాధ పడిపోకండి. ఈ నలిగిపోయిన నోట్లని, చిరిగిపోయిన నోట్లను మీ సమీపం లోని ఏ బ్యాంక్‌ కి వెళ్లినా ఎంతో సులువుగానే మార్చుకో వచ్చని, వాటికి బదులుగా కొత్త నోట్లను మీరు తీసుకోవచ్చు అని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) చెప్పింది.

ఇది ఇలా ఉండగా పాడైపోయిన నోట్లను ప్రతి బ్యాంక్‌ తప్పనిసరిగా తీసుకోవాలని… తమ ఖాతాదారుల కాదా అన్నది కూడా చూడవద్దని పైగా ఎటువంటి చార్జెస్ కూడా తీసుకోవద్దు అని ఆర్బీఐ అంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా లో ఇటీవల రూ.5 లక్షల విలువైన నోట్లు చెదలు పట్టిన ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో ఆర్బీఐ ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

అందుకే ఇక కరెన్సీని కూడా ప్రత్యేక ప్రక్రియ ద్వారా మార్చుకోవచ్చని సెంట్రల్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఇది ఇలా ఉంటే నోట్లపై నెంబర్‌ మాత్రం తప్పక కనిపించాల్సి ఉంటుంది అని చెప్పింది. కాబట్టి ఇక పై పాడైపోయిన నోట్లను సులువుగా బ్యాంక్ కి వెళ్లి మార్చేయ వచ్చు. మీ పాత నోట్లకి బదులుగా కొత్త నోట్లని మీరు ఈజీగా తీసుకోవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news