బ్యాంకు లాకర్లను ఉపయోగిస్తున్నారా..? అయితే ఈ విషయాలు మీకోసం..!

-

బ్యాంక్స్ లాకర్ ఫెసిలిటీస్ కూడా అందిస్తాయి. చాల మంది వాటిని ఉపయోగిస్తూ వుంటారు. మీరు కూడా బ్యాంకు లాకర్లను ఉపయోగిస్తున్నారా..? అయితే వీటిని మీరు చూడాల్సిందే. వివరాల లోకి వెళితే… బ్యాంకు లాకర్లను వినియోగించే ఖాతాదారులు నియమాలను పూర్తిగా తెలుసుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచిస్తోంది. ఎక్కువ రోజులు కనుక మీరు వాటిని తెరవకుండా వున్నారు అంటే బ్యాంక్ ఏ స్వయంగా చెయ్యొచ్చని అంటున్నారు.

ఆ అధికారం వాళ్లకి ఉంది. కనుక మీరు కనీసం సంవత్సరం లో ఒక్క సరైన ఓపెన్ చెయ్యాలి గుర్తుంచుకోండి. లో రిస్క్ కేటగిరీలో ఉన్న ఖాతాదారులకు బ్యాంకులు కాస్త సమయం ఇస్తాయి. కానీ మీడియం రిస్క్ విభాగం లో ఉన్న వారు మూడు సంవత్సరాల వరకు లాకర్‌ ఓపెన్ చేయకపోతే కనుక వారికి బ్యాంకు నోటీసు పంపుతుంది గమనించండి. ఒకేవేళ కనక ఎక్కువ రోజులు తెరవకుండా ఉంచేస్తే కస్టమర్లకు బ్యాంకు ఒక నోటీసుల పంపుతుంది.

లాకర్‌ సదుపాయాన్ని కొనసాగించాలని, లేదా సరెండర్‌ చేయాలని పంపించే నోటీసులో ఉంటుంది. ఎందుకు అన్ని రోజుల నుండి ఓపెన్ చెయ్యలేదు అనేది రాత పూర్వకంగా తెలుపాల్సి ఉంటుంది. అది నిజం అని బ్యాంకు నమ్మితే ఈ లాకర్ ఫెసిలిటీ కొనసాగించవచ్చు. ఇది ఇలా ఉంటే ప్రసవా భారతీయులు, ఉద్యోగంలో బదిలీపై ఇతర ప్రాంతాల్లో ఉంటున్ననవారు, ఏదైనా ఇతర కారణాల తో నగరంలో లేని వారు లాకర్‌ సదుపాయాన్ని ఉపయోగించడానికి బ్యాంక్ పెర్మిషన్ ని ఇస్తుంది.

మీ వద్ద సరైన కారణాలు లేకపోతే రద్దు చేసేసి ఆ లాకర్‌ను వేరొకరికి కేటాయించవచ్చు. రద్దు చేసిన లాకర్లను తెరిచేటప్పుడు బ్యాంకు కూడా కొన్ని నియమ నిబంధనలు పాటిస్తుంది. రూల్స్ ని పాటిస్తేనే మంచిది. ముందే ఖాతాదారులు లాకర్‌ సదుపాయం కావాలని కోరినప్పుడు ఈ నిబంధనలు అగ్రిమెంట్‌ లో భాగంగా ఉంటాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news