కార్ డ్యాష్ బోర్డ్ మీద కాళ్ళు పెడుతున్నారా…? అయితే ఈ ప్రమాదం తప్పదు..!

కారు లో అలా ప్రయాణం చేస్తూ చాల మంది కార్ డ్యాష్ బోర్డ్ మీద కాళ్ళు పెట్టి చిల్ అవుతూ ఉంటారు. అయితే దాని వల్ల చాల ప్రమాదం ఉంది గమనించండి. వివరా ల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఔడ్రా టాటమ్ అనే మహిళ కార్ డ్యాష్ బోర్డ్ మీద కాళ్ళు పెట్టి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఇప్పుడు మంచానికి పరిమితమైంది ఈమె. దీనితో ఆమె మీరు ఈ తప్పు చేయొద్దంటూ చెబుతోంది.

car dashboard
car dashboard

ఔడ్రా టాటమ్ భర్త కార్ డ్రైవ్ చేస్తుండగా ఆమె పక్క సీట్లో కూర్చుంది. ఆమె రిలాక్స్ కోసం కార్ డ్యాష్ బోర్డ్ మీద కాళ్లు పెట్టింది. తన భర్త కాళ్ళు కింద పెట్టుకోమని ఆమెకి చెప్పిన కూడా ఆమె వినలేదు. దీంతో కార్ ఎయిర్ బ్యాగ్స్ ఒక్క సారిగా ఓపెన్ అయ్యాయి. అంతే ఆమె కాలు విరిగి ముక్కుకు గుద్దుకుంది.

దీంతో దాదాపు 3 నెలలు మంచం మీదే ఉంది. ఇది నిజంగా ప్రమాదకరమే కదా..! ఇలా డ్యాష్ బోర్డ్ మీద బలంగా కాళ్లు పెట్టడం వల్ల ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడం ఒకటైతే డ్రైవింగ్ చేసే వాళ్లకు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కనుక ఒకవేళ డ్రైవర్ పక్క సీట్లో మీరు కూర్చుంటే మాత్రం ఈ మిస్టేక్స్ చెయ్యకండి.