ఐపీఎల్‌ కోసం జియో అందిస్తున్న క్రికెట్‌ ప్లాన్స్‌ ఇవే

ఐపీఎల్‌ టోర్నమెంట్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఏప్రిల్‌ 9 నుంచి క్రికెట్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక ఐపీఎల్‌ కోసం జియో అందిస్తున్న క్రికెట్‌ ప్లాన్స్‌ ఐపీఎల్‌ కోసం జియో అందిస్తున్న క్రికెట్‌ ప్లాన్స్‌ ఇవే గురించి తెలుసుకుందాం.

  • జియో ప్రత్యేకంగా క్రికెట్‌ ప్లాన్‌లో మీరు క్రికెట్‌ను స్మార్ట్‌ఫోన్‌లో చూడాలనుకుంటే రూ.401 నుంచి మొదలవుతుంది. ఈ ప్లాన్‌ రీఛార్జ్‌ చేసుకుంటే అన్‌ లిమిటెడ్‌ కాలింగ్‌ బెనిఫిట్స్‌తో పాటు ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉచితంగా చూడవచ్చు.
  • రిలయన్స్‌ జియో రూ.401 క్రికెట్‌ ప్లాన్‌ రీఛార్జ్‌ చేస్తే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజూ 3 జీబీ డేటా చొప్పున 84జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా మరో 6 జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 90 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌ లిమిటెడ్‌ కాల్స్, రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్‌ ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో క్లౌడ్‌ యాక్సెస్‌ ఉచితంగా లభిస్తుంది.
  • జియో రూ.598 క్రికెట్‌ ప్లాన్‌ రీఛార్జ్‌ చేస్తే, రోజూ 2జీబీ డేటా చొప్పున 56 రోజులకు 112 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌ లిమిటెడ్‌ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్‌ ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది. దీంతో పాటు జియో టీవీ యాక్సెస్‌ ఉచితంగా లభిస్తుంది.
  • రిలయన్స్‌ జియో రూ.777 క్రికెట్‌ ప్లాన్‌ రీఛార్జ్‌ చేస్తే, రోజూ 1.5జీబీ డేటా చొప్పున 84 రోజులకు 126 జీబీ డేటా, అదనంగా మరో 5జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 131 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌ లిమిటెడ్‌ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్‌ ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, క్లౌడ్‌ యాక్సెస్‌ ఉచితంగా లభిస్తుంది.
  • రిలయన్స్‌ జియో రూ.2,599 క్రికెట్‌ ప్లాన్‌ రీఛార్జ్‌ చేస్తే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున 365 రోజులకు 730 జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా మరో 10జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 740 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు, డిస్నీ+ హాట్‌స్టార్‌ ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది. జియో యాక్సెస్‌ ఉచితంగా లభిస్తుంది.
  • రిలయన్స్‌ జియో రూ.499 క్రికెట్‌ యాడ్‌ ఆన్‌ ప్లాన్‌ రీఛార్జ్‌ చేస్తే 56 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ చొప్పున 56 రోజులకు 84 జీబీ డేటా వాడుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్‌ ఏడాది సబ్‌స్క్రిప్షన్, జియో టీవీ యాక్సెస్‌ లభిస్తుంది.
  • జియో రూ.612 క్రికెట్‌ యాడ్‌ ఆన్‌ ప్లాన్‌ రీఛార్జ్‌ చేస్తే 72 జీబీ డేటా లభిస్తుంది. యాక్టీవ్‌ ప్లాన్‌ ఉన్నవారు ఈ ప్లాన్‌ రీఛార్జ్‌ చేసుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్‌ ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది. జియో టీవీ యాక్సెస్‌ ఉచితంగా లభిస్తుంది.
  • రిలయన్స్‌ జియో రూ.1,004 క్రికెట్‌ యాడ్‌ ఆన్‌ ప్లాన్‌ రీఛార్జ్‌ చేస్తే 120 రోజుల వ్యాలిడిటీ, మొత్తం 200జీబీ డేటా వాడుకోవచ్చు. ఇతర ఉచిత సేవలను కూడా పొందవచ్చు.
  • జియో రూ.1206 క్రికెట్‌ యాడ్‌ ఆన్‌ ప్లాన్‌ రీఛార్జ్‌ చేస్తే 180 రోజుల వ్యాలిడిటీ, మొత్తం 240జీబీ డేటా లభిస్తుంది. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్‌ ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది.
  • జియో రూ.1208 ప్లాన్‌ రీఛార్జ్‌ చేస్తే 240 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. మొత్తం 240జీబీ డేటా లభిస్తుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌ ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది. దీంతో పాటు జియో టీవీ యాక్సెస్‌ ఉచితంగా లభిస్తుంది.