ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో అద్భుతమైన వాషింగ్‌ మెషీన్‌!

పెరుగుతున్న టెక్నాలజీలో భాగంగా మరో అద్భుతం నెలకొంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే వాషింగ్‌ మెషీన్‌ మార్కెట్‌లోకి విడుదలైంది. దీన్ని తయారు చేసిన సాంసంగ్‌ (AI) ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే విధాంగా రూపొందించింది. మనుషుల అవసరాలకు అనుగుణంగా ఈ వాషింగ్‌ మెషీన్లను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇతర ప్రముఖ కంపెనీలు కూడా వాషింగ్‌ మెషీన్లకు ఏఐ సాంకేతికతను జోడిస్తున్నారు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో పనిచేసే ఏఐ వాషింగ్‌ మెషీన్‌ను సాంసంగ్‌ తయారు చేసింది. ఎకోబబుల్, క్విక్‌ డ్రైవ్‌ టెక్నాలజీతో ఇవి పనిచేస్తాయి. అదేవిధంగా 45 శాతం అధికంగా ఫ్యాబ్రిక్‌ కేర్‌ను అందిస్తాయి. దీంతోపాటు టైం, కరెంట్‌ ఖర్చును కూడా ఆదా చేస్తాయని కంపెనీ తెలిపింది.

మొత్తం 21 వాషింగ్‌ మెషిన్లను విడుదల చేసింది. ఇవన్నీ ఏఐ ఫీచర్లను కలిగి ఉంటాయి. వినియోగదారుల లాండ్రీ అలవాట్లను ఇవి నేర్చుకొని, గుర్తుంచుకుంటాయి. ఎప్పుడూ వాడే వాష్‌ సైకిల్‌ను వినియోగదారులకు సూచిస్తాయి. లాండ్రీ ప్లానర్‌.. దుస్తుల రకాలు, రంగు ఆధారంగా ఎంతసేపు వాటిని వాష్‌ చేయాలో సూచిస్తుంది. వీటిని సాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ ఫోన్లు, స్మార్ట్‌ టీవీలకు, అలెక్సా, గూగుల్‌ వంటి ఇతర వాయిస్‌ డివైజ్‌లకు కనెక్ట్‌ చేసుకోవచ్చు.
దేశీయ మార్కెట్‌ అవసరాలకు ఇలాంటి సాంకేతికతో వాషింగ్‌ మెషీన్లను అభివృద్ధి చేయడం గొప్ప అని సంస్థ ప్రతినిధి రాజు చెప్పారు. ఇవి 2,000కు పైగా వాష్‌ కాంబినేషన్లు, విభిన్న రకాల ఫ్యాబ్రిక్‌ల కోసం 2.8 మిలియన్ల డేటా ఎనాలిసిస్‌ పాయింట్లతో లభిస్తున్నాయన్నారు.

ఎక్కడ లభిస్తున్నాయి?

ఈ సరికొత్త ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వాషింగ్‌ మెషిన్లు ఏప్రిల్‌ మొదటి వారం నుంచి దేశంలోని అన్ని రిటైల్‌ దుకాణాల్లో లభ్యమవుతాయి. వీటి ధరలు రూ.35,400 నుంచి ప్రారంభమవుతున్నాయి. కొన్ని మోడళ్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, సాంసంగ్‌ ఆన్‌లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది.