ఆ యాప్స్ లో డబ్బులు ఇలా సేవ్ చేసుకోండి…!

ఇటీవలి కాలంలో ఆన్లైన్ లో డబ్బులు చెల్లించడం అనేది ఎక్కువైపోయింది. ప్రధానంగా పేటిఎం, ఫోన్ పే వంటి యాప్స్ లో చెల్లింపులు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న అందరూ కూడా వాటిపై ఎక్కువగా ఆధాపడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువగా మనం చూస్తూ వస్తున్నాం. అయితే అందులో డబ్బులు ఎంత వరకు భద్రం అనేది మాత్రం చెప్పలేని పరిస్థితి.

చిన్న తేడా వచ్చినా సరే కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తం పోతుంది. ఈ నేపధ్యంలో కొన్ని జాగ్రత్తలు అవసరమని అంటున్నారు నిపుణులు. ఫిషింగ్, మాల్‌వేర్ ఎటాక్, ఇమెయిల్ స్పూఫింగ్ లాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఎప్పటికప్పుడు ఇమెయిల్స్, మెసేజెస్, ట్వీట్స్ ద్వారా కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నా డబ్బులు పోగొట్టుకుంటారు.

అయితే డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాలి అంటే మాత్రం కొన్ని సలహాలు ఉన్నాయి. యూపీఐ అకౌంట్… క్షణాల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి, పేమెంట్స్ చేయడానికి ఉపయోగపడుతున్న ఫీచర్. ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డులకు పిన్ ఉన్నట్టే యూపీఐ అకౌంట్‌కి కూడా ఒక పిన్ ఉంటుంది. ఆ పిన్ మీ సన్నిహితులకు కూడా చెప్పకండి. ఏటీఎం కార్డు కన్నా ఎక్కువ భద్రంగా దాన్ని మైంటైన్ చెయ్యాలి.

మీ యూపీఐ అకౌంట్ ఉన్న యాప్‌లో మినహా… మరే యాప్‌లో మీ యూపీఐ పిన్‌ను ఎంటర్ ఎలాంటి పరిస్థితుల్లోను చేయొద్దు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే… మీరు డబ్బులు పంపడానికి, అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి మాత్రమే మీ యూపీఐ పిన్ ఎంటర్ చెయ్యాలి. డబ్బులు తీసుకోవడానికి దాంతో అవసరం లేదు. ప్లే స్టోర్‌లో గూగుల్ పే, ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్ పే లాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేసేముందు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఒక యాప్ పోలిన యాప్స్ చాలా ఉంటాయి. పొరపాటున నకిలీ యాప్ డౌన్‌లోడ్ చేస్తే డబ్బులు పోయే అవకాశం ఉంది కాబట్టి అందుకే యాప్ డౌన్‌లోడ్ చేసేముందు డెవలపర్ పేరు చెక్ చేయాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా యాప్ డౌన్‌లోడ్ చేయవద్దు. ఏదైనా అనుమానాలు ఉంటే యాప్ సూచించిన కస్టమర్ కేర్ కి మాత్రమె ఫోన్ చెయ్యాలి గాని మరొకరికి చేయకూడదు.