SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఈ సేవలు పొందాలంటే ఫోన్ నెంబర్ తప్పనిసరి..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వీటి వలన ఎన్నో రకాల లాభాలు మనకి కలుగుతాయి. అయితే తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ ని తీసుకు రావడం జరిగింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ ని మార్చడం జరిగింది. ఆన్‌లైన్, నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లతో పాటు నేటి కాలంలో ఫ్రాడ్స్ ఎక్కువగా జరగడం మనం చూస్తున్నాం. ఫ్రాడ్స్ చేయడం వలన ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారు.

అందుకోసమే ఈ నిర్ణయాన్ని స్టేట్ బ్యాంక్ తీసుకుంది. అందుకే బ్యాంక్ కస్టమర్లు ఎస్‌బీఐ మొబైల్ బ్యాంక్ సర్వీసులు పొందటం ఇక అంత ఈజీ కాదు. కస్టమర్స్ కి తప్పక ఎస్‌బీఐ అకౌంట్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండాలి.

ఇలా ఎస్‌బీఐ అకౌంట్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ మీ స్మార్ట్‌ఫోన్ ఉంటేనే మీరు ఎస్‌బీఐ యోనో యాప్‌ను వాడడానికి వీలవుతుంది. లేదు అంటే అస్సలు కుదరదు. ఈ విషయాన్ని
ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

ఇలా ఈ కొత్త రూల్ ని తీసుకు రావడం వలన యోనో యాప్ సెక్యూరిటీని మరింత పెంచేసింది. కనుక ఇప్పుడు ఎవరైనా ఎస్‌బీఐ యోనో యాప్ వాడాలంటే కచ్చితంగా రిజిస్టర్డ్ మొబైల్ మీ ఫోన్‌లో వుండాలి గమనించండి.

Read more RELATED
Recommended to you

Latest news