కారు కొనాలనుకునే వాళ్ళకి ఎస్‌బీఐ బంపరాఫర్స్..!

మీరు కొత్త కారుని కొనాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఈ ఆఫర్ అదిరిపోయింది. కారు కొనుగోలు చెయ్యాలని అనుకునే వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక మరి దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

sbi | ఎస్‌బీఐ
sbi | ఎస్‌బీఐ

దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కారు కొనే వారికి గుడ్ న్యూస్ చెబుతోంది. కొత్తగా కారు తీసుకోవాలంటే ఈ ఆఫర్లు బెస్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉంచింది. దీనితో కారు కొనేవాళ్ళకి బెనిఫిట్ గా ఉండనుంది.

ఇక ఈ ఆఫర్లు గురించి కూడా చూసేస్తే.. హ్యుందాయ్ అల్కాజర్ కారు కొనే వారికి ఈ ఆఫర్ ఉంటుంది అని స్టేట్ బ్యాంక్ వెల్లడించింది. ఇది 6, 7 సీటర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కారు కొంటే మీకు వడ్డీ రేటులో 0.25 శాతం తగ్గింపు లభిస్తుంది.

ఈ ఆఫర్ ఎస్‌బీఐ తన యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా ఇవ్వడం జరుగుతోంది. ఇది ఇలా ఉంటే కారు ధరకు సమానమైన మొత్తంలో బ్యాంక్ నుంచి లోన్ పొందొచ్చు.

అంటే 100 శాతం ఆన్‌రోడ్ ఫైనాన్స్ ని స్టేట్ బ్యాంక్ ఇస్తోంది. అంతే కాదండి జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ ని కూడా మీరు పొందొచ్చు. యోనో ద్వారా కారుని కొనాలంటేనే ఈ లాభాలని పొందొచ్చు.