స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే లోన్ ఆఫర్… ఇలా అప్లై చేసుకోండి..!

దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది. దీనితో మంచి లాభాలు పొందొచ్చు. కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే ఆఫర్ ఒకటి ఇస్తోంది. కారు కొనేందుకు లోన్ తీసుకుంటే రూ.లక్ష మొత్తానికి ఈఎంఐ రూ.1534 నుంచి స్టార్ట్ అవుతుంది. దానితో పాటుగా ఇతర ప్రయోజనాలు కూడా పొందొచ్చు. అదే విధంగా దీనిలో జీరో ప్రాసెసింగ్ బెనిఫిట్ కూడా ఉంది.

పైగా లోన్ కోసం కూడా ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. యోనో ద్వారా లోన్ పొందే అవకాశముంది. యోనో ద్వారా లోన్ కోసం అప్లై చేస్తే వెంటనే లోన్ పొందొచ్చు. వడ్డీ రేటు 7.5 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది.

ఆన్‌రోడ్ ధరకు సమానమైన మొత్తాన్ని లోన్ రూపంలో పొందొచ్చు. తీసుకున్న రుణాన్ని 7 ఏళ్లలోగా తిరిగి చెల్లించొచ్చు. కనీసం రూ.3 లక్షల జీతం అయినా ఏడాదికి వస్తుండాలి.