ఎస్‌బీఐ ఆఫ‌ర్.. ప్రాసెసింగ్ ఫీజు లేకుండా త‌క్కువ వ‌డ్డీకే ఇంటి రుణం..

Join Our Community
follow manalokam on social media

దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బీఐ వినియోగ‌దారుల‌కు అతి త‌క్కువ వ‌డ్డీకే గృహ రుణాల‌ను అందిస్తోంది. కేవ‌లం 6.80 శాతం వ‌డ్డీతోనే ఇంటి రుణాల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. అలాగే రుణాల‌కు గాను ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజును కూడా వ‌సూలు చేయ‌డం లేద‌ని తెలియజేసింది. మార్చి నెల ఆఖ‌రు వ‌ర‌కు ఈ అవ‌కాశం అందుబాటులో ఉంటుంద‌ని తెలిపింది.

sbi gives lowest interest home loan with no processing fee

ఎస్‌బీఐ భిన్న ర‌కాల వినియోగ‌దారుల‌కు అనేక హోం లోన్ స్కీమ్‌ల‌ను అందిస్తోంది. ప్ర‌భుత్వ ఉద్యోగుల కోసం ఎస్‌బీఐ ప్రివిలెజ్ హోం లోమ్‌, డిఫెన్స్ ఉద్యోగుల‌కు ఎస్‌బీఐ శౌర్య హోం లోన్‌, ఇత‌రుల‌కు ఎస్‌బీఐ మ్యాక్స్ గెయిన్ హోం లోన్‌, ఎస్‌బీఐ స్మార్ట్ హోమ్‌, టాప‌ప్ లోన్, ఎస్‌బీఐ ఎన్ఆర్ఐ హోం లోన్‌, ఫ్లెక్సి పే హోం లోన్‌, ఎస్‌బీఐ హ‌ర్ ఘ‌ర్ హోం లోన్ (మ‌హిళ‌ల‌కు).. ఇలా అనేక ర‌కాల ఇంటి రుణాల‌ను ఎస్‌బీఐ అందిస్తోంది.

ఎస్‌బీఐలో వినియోగ‌దారులు హోం లోన్ తీసుకోవాలంటే 7208933140 అనే నంబ‌ర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. బ్యాంకు ప్ర‌తినిధులు వినియోగ‌దారుల‌ను సంప్ర‌దించి లోన్ల‌ను వివ‌రించి ఆఫ‌ర్ల గురించి తెలియ‌జేస్తారు. ఇప్ప‌టికే గృహ రుణ మార్కెట్‌లో ఎస్‌బీఐ వాటా 34 శాతం ఉండ‌గా, నిత్యం కొత్త‌గా 1000 మందికి ఇంటి రుణాల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...