ఎస్​బీఐ ఎన్ఏవీ ఈ క్యాష్ కార్డు లాంచ్…!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్​ నేవీ భాగస్వామ్యంతో సరికొత్త ఎన్​ఏవీ–ఈ క్యాష్​ కార్డును లాంచ్​ చేసింది. ఈ NAV-eCash కార్డును భారతదేశంలోని అతిపెద్ద నావల్ ఎయిర్‌క్రాఫ్ట్​గా పేరొందిన ఐఎన్​ఎస్​ విక్రమాదిత్యలో ఆవిష్కరించింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఈ NAV-eCash కార్డ్ డిజిటల్ చెల్లింపుల విభాగంలో మైలురాయి నిలుస్తుందని అన్నారు.

SBI
SBI

అయితే సముద్రంలో నౌకను మోహరించే సమయంలో భౌతిక నగదు నిర్వహణలో తలెత్తే సమస్యలకు ఈ కార్డు చెక్​ పెడుతుందని చెప్పడం జరిగింది. అయితే మాములుగా నౌకాశ్రయాల్లో ఉన్నప్పుడు ఇంటర్నెట్​ కనెక్టివిటీ ఉండదు కనుక డబ్బులని విత్ డ్రా చేసుకోవాలి అంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని డ్యూయల్-చిప్ టెక్నాలజీ సహాయంతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లావాదేవీలను నిర్వహించే విధంగా ఈ సరికొత్త కార్డుని రూపొందించడం జరిగింది.

దీని గురించి నేవి అధికారులు మాట్లాడుతూ.. ఎస్​బీఐ. ఈ కొత్త NAV-eCash కార్డు డిజిటల్​ చెల్లింపుల పరిష్కారం చూపిస్తుందని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా విజన్​కు ఇది నిదర్శనమని అన్నారు. ఎస్​బీఐ, నేవీ అధికారులు సంయుక్తంగా దీనిని రూపొందించడం జరిగింది.

రక్షణ దళాల పట్ల బ్యాంకు నిబద్ధత, భారత సాయుధ దళాలతో తమ సుదీర్ఘ బంధాన్ని ఎస్​బీఐ వివరించింది. కాగా, ఎస్​బీఐ ఇప్పటివరకు 30 లక్షల భారతీయ కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చంది. ఆస్తులు, డిపాజిట్లు, శాఖలు, కస్టమర్లు, ఉద్యోగుల పరంగా దేశంలోనే అతి పెద్ద వాణిజ్య బ్యాంకుగా స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా రాణిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news