NobelPrize 2021 :రసాయన శాస్త్రంలో ఇద్దరిని వరించిన నోబెల్ ప్రైజ్

-

ఈ సంవత్సరం రసాయనశాస్త్రంలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారం ఇద్దరికీ దక్కింది. బెంజమిన్ లిస్టు మరియు డేవిడ్ వి సి మెక్ మిలాన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ ఏడాది నోబెల్ బహుమతి ని కైవసం చేసుకున్నారు. అసి మెట్రిక్ ఆర్గానో క్యాపిటలసిస్ ను అభివృద్ధి చేసినందుకు గాను వీరికి ఈ పురస్కారం వరించింది. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడమీ కీలక ప్రకటన చేసింది. అణువులు నిర్మించడం చాలా కష్టమైన ప్రక్రియ.

“అలాంటిది పరమాణు నిర్మాణం లో ఆర్గానో క్యాపిటలసిస్ అనే స్పష్టమైన నూతన విధానాన్ని వీరిద్దరు అభివృద్ధి చేశారు. ఇది ఔషధాల పరిశోధనల్లో గొప్ప ప్రభావం చూపించింది. రసాయన శాస్త్రాన్ని పర్యావరణ హితంగా మార్చింది” అంటూ రాయల్ స్వీడిష్ తన ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా ఈ సంవత్సరం భౌతిక శాస్త్రంలో ఏకంగా ముగ్గురికి నోబెల్ బహుమతి వరించిన సంగతి తెలిసిందే. శాస్త్రవేత్తలు సుకురో మనాబో, క్లాస్ హసిల్మన్ మరియు జార్జియా పారిసి లను ఈ ఏడాది నోబెల్ బహుమతులకు ఎంపిక చేసినట్లు నిన్న ప్రకటన వెలువడింది.

Read more RELATED
Recommended to you

Latest news