స్టేట్ బ్యాంక్ రూపే కార్డు తో ఎన్నో బెనిఫిట్స్…!

Join Our Community
follow manalokam on social media

స్టేట్ బ్యాంక్ రూపే కార్డు తో ఎన్నో బెనిఫిట్స్ పొందొచ్చు. మీ వద్ద కూడా స్టేట్ బ్యాంక్ రూపే కార్డు ఉందా…? అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మీకోసం అదిరిపోయే ఆఫర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తోంది. తాజాగా ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాలని చెప్పడం జరిగింది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI అదిరిపోయే ఆఫర్లు తమ కస్టమర్ల కోసం అందిస్తోంది. పలు రకాల బ్రాండ్ల పై ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు కూడా ఇప్పుడు అందుబాటు లో ఉన్నాయి.

దీనితో కస్టమర్స్ ఈ ఆఫర్స్ ని వినియోగించుకుని డబ్బులు ఆదా చేసుకోవచ్చు. లైఫ్‌స్టైల్ నుంచి హెల్త్ వరకు ఇలా ఎన్నో బ్రాండ్ల పై ఆఫర్లు మీరు ఇప్పుడు పొందొచ్చు. అయితే ఈ ఆఫర్స్ ఎవరికీ వర్తిస్తాయి, ఎలా వర్తిస్తాయి అనేవి చూద్దాం. రూపే డెబిట్ కార్డు కలిగిన వారికి ఎస్‌బీఐ ఈ ఆఫర్స్ వర్తిస్తున్నట్టు చెప్పింది. ఇక ఆఫర్స్ ని చూస్తే… ఫస్ట్‌క్రై ప్రొడక్టులపై మీరు షాపింగ్ చేస్తే రూ.400 వరకు తగ్గింపు ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ కనీసం రూ.1600 ఖర్చు పెడితేనే అవుతుంది.

ఫర్లెస్కో బ్రాండ్‌ పై కూడా రూ.400 తగ్గింపు లభిస్తోంది. ఇంకా ఎఫ్ఏబీ హోటల్స్‌పై అదనంగా 30 శాతం తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. యాప్ కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇది ఇలా ఉండగా రైల్‌ యాత్ర వెబ్‌సైట్‌లో అయితే 15 శాతం తగ్గింపు మీకు లభిస్తుంది. రూ. 200 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈజీమైట్రిప్ వెబ్‌సైట్ ‌లో అయితే రూ.800 తగ్గింపు పొందొచ్చు. బుకింగ్ వ్యాల్యూ రూ.3 వేలు ఉండాలి. ప్రోమో కోడ్ ఉపయోగించి ఎస్‌బీఐ రూపే కార్డు కలిగిన వారు ఆఫర్ పొందచ్చు అని ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.

 

 

 

TOP STORIES

ఐపీఎల్ 2021 షెడ్యూల్ విడుద‌ల‌.. మ్యాచ్‌లు జ‌రిగే తేదీలు ఇవే..!

కోవిడ్ నేప‌థ్యంలో గ‌తేడాది ఐపీఎల్ ఆల‌స్యంగా జ‌రిగినా ఈ ఏడాది మాత్రం అనుకున్న తేదీల‌కే ఐపీఎల్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ప్రేక్షకులు గ‌తేడాది వేస‌విలో ఐపీఎల్‌ను...