ఈ మధ్య కాలం లో చాలా మంది తమకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. దీని వలన చక్కటి లాభాలని పొందుతున్నారు. పెన్షన్ ని కూడా పొందుతున్నారు. అయితే పెన్షన్ ప్రజలకు స్థిరమైన ఆదాయాలను ఇస్తుంది. అయితే మనకి ఉన్న స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే మంచిగా పెన్షన్ ని పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
18 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.42ను ఇన్వెస్ట్ చేస్తే.. 60 ఏళ్లు వచ్చినప్పుడు నెలకు రూ.1000 పెన్షన్ లభిస్తుంది. అదే ఒకవేళ 18 ఏళ్ల వయసులో నెలకు రూ.210 పెట్టుబడి పెడితే అప్పుడు పెన్షన్ రూ.5000 వస్తుంది. అయితే ఈ ప్రీమియం వయస్సుని బట్టీ ఉంటుంది. 40 ఏళ్ల వయసు నుంచే నెలకు రూ.5 వేల పెన్షన్ కావాలనుకుంటే, నెలకు రూ.1,454 డిపాజిట్ చెయ్యాల్సి వుంది.
ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు. సెక్షన్ 80సీసీడీ కింద గరిష్టంగా లభించే డిడక్షన్ రూ.2 లక్షల వరకు ఉంది. అటల్ పెన్షన్ యోజన ఎక్కువగా మహిళలను ఆకర్షిస్తూ ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ 2021 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్యనున్న వయసున్న 43 శాతం మంది ఈ స్కీమ్‌లో చేరినట్టు వెల్లడించారు. మార్చి 2016న, ఈ స్కీమ్‌లో మహిళల భాగస్వామ్యం 37 శాతం ఉండగా.. 2021 సెప్టెంబర్ నాటికి 44 శాతం పెరిగింది.