ఐసీఐసీఐ అదిరే పాలసీ… రూ.22 లక్షలు ఇలా పొందండి..!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారు. మీరు కూడా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే దీనిని చూడాల్సిందే. ఐసీఐసీ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా పాలసీని అందిస్తోంది. దీని వలన చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు. ఇన్సూరెన్స్‌ తో పాటు కచ్చితమైన రాబడి ఉంటుంది.

లైఫ్ కవరేజ్‌తో పాటు కచ్చితమైన రిటర్న్ కూడా లభిస్తుంది. 100 శాతం గ్యారంటీ బెనిఫిట్స్, ట్యాక్స్ ఫ్రీ రిటర్స్స్, లైఫ్ కవరేజ్, లోన్ ఫెసిలిటీస్ కూడా మీరు పొందొచ్చు. లంప్ సమ్, ఇన్‌కమ్, ఎర్లీ ఇన్‌కమ్, సింగిల్ పే ఇన్‌కమ్ ఆప్షన్లు ఉంటాయి.

నచ్చిన దానిని సెలెక్ట్ చేసుకోవడానికి అవుతుంది. 5 నుంచి 20 ఏళ్ల వరకు ఈ పాలసీ యొక్క టర్మ్ ఉంటుంది. ప్రీమియం టర్మ్ 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకు ఉంది. ఇలా ఈ పాలసీని ఎవరు తీసుకొచ్చు అనేది చూస్తే.. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. గరిష్టంగా రూ.2.5 లక్షల వరకు ప్రీమియం ని ఏడాదికి చెల్లించచ్చు. గరిష్టంగా రూ.25 లక్షల వరకు బీమా మొత్తం వస్తుంది.

ఒకవేళ ఓ వ్యక్తి ఏడాదికి రూ.లక్ష ప్రీమియం చెల్లించాలని అనుకుని పాలసీ టర్మ్ 20 ఏళ్లు. ప్రీమియం చెల్లింపు టర్మ్ 10 ఏళ్లు. లంప్ సమ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే 20 ఏళ్ల తర్వాత చేతికి ఒకేసారి రూ.22 లక్షలకు పైగా వస్తాయి. ఒకవేళ ఇన్‌కమ్ ఆప్షన్ ఎంచుకుంటే పదేళ్ల ప్రీమియం చెల్లింపు తర్వాత రెండేళ్ల తర్వాత నుండి ఏడాదికి చేతికి రూ.1.93 లక్షలు వస్తాయి. పదేళ్ల పాటు ఇలా డబ్బులొస్తాయి. నెలకు రూ.16,500 వరకు పొందొచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news