కేంద్రంలోని మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హిట్ అండ్ రన్ ప్రమాదాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుండాలకు ఇక పై 8 రెట్లు అధిక పరిహారం పెంచుతూ నిర్నయం తీసుకుంది మోడీ సర్కార్. ఏప్రిల్ 1 వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని డిసైడ్ అయింది కేంద్రంలోని మోడీ సర్కార్.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ నోటీఫికేషన్ కూడా విడుదల చేసింది. కేంద్ర రోడ్డు రవాణ రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాదం లో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల వరకు పరిహారం లభించనుందన్న మాట. అంతేకాదు.. తీవ్రంగా గాయ పడిన వారికి కూడా ఆర్థిక సాయం పెంచారు. వీరికి రూ. 50 వేలు లభించనున్నాయి. ప్రస్తుతం వీరికి రూ. 12500 చెల్లిస్తున్నారు. అయితే.. ఈ కొత్త రూల్ ను ఏప్రిల్ మాసం 1 వ తేదీ నుంచి అమలులోకి తీసుకు రానుంది కేంద్ర ప్రభుత్వం.
https://twitter.com/PIB_India/status/1497970396196261889?s=20&t=MU81u4lA0BajvE8chbomXQ