PPF : ఇలా చేసారంటే.. పోస్ట్ ఆఫీస్ స్కీముతో కోటీశ్వరులు అయిపోవచ్చు..!

-

PPF: కేంద్ర ప్రభుత్వం అనేక రకాల స్కీములను అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే స్కీముల వలన చాలామంది ప్రయోజనం పొందుతున్నారు. కేంద్రం అందించే స్కీములో PPF కూడా ఒకటి. దీర్ఘకాలంలో దీంట్లో భారీ రిటర్న్స్ అందుకోవచ్చు. డబ్బులు పొదుపు చేయడానికి బెస్ట్ స్కీమ్ ఇది. ఆకర్షణీయమైన స్థాయిలో వడ్డీ రేటు ఉండడం, చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్న ఈ పథకంతో ఇప్పటికే చాలా మంది ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఇది పోస్ట్ ఆఫీస్ స్కీం. నెలనెలా మీరు కొంత మొత్తంలో పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్తే చాలు. దీర్ఘకాలంలో అంటే మెచ్యూరిటీ సమయంలో పెద్ద మొత్తంలో రిటర్న్స్ ని అందుకోవచ్చు.

నెలకి 1000, 2000, 5000, 10,000 ఇలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 15 ఏళ్ల పాటు డిపాజిట్ చేస్తే లక్షల్లో లాభం వస్తుంది. ఇక దీంట్లో ఎంత రిటర్న్స్ వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.. ఎవరైనా వ్యక్తి ఇందులో ఏడాదికి లక్షన్నర పెట్టొచ్చు. మినిమం 500 నుంచి పెట్టవచ్చు. ఇప్పుడు దీనికి 7.1% వడ్డీ వస్తోంది.

15 ఏళ్లకు మెచ్యూర్ అయిన తర్వాత ఐదేళ్లు కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 25 ఏళ్ల పాటు మీరు మొత్తం రూ. 37,50,000 పెట్టినట్లయితే వడ్డీ మాత్రమే 65,58,015 వస్తుంది. మొత్తం 1,03,08,015 మీకు వస్తాయి. 30 ఏళ్లు పాటు మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే 1,54,50,911 వస్తుంది. 35 ఏళ్ల పాటు మీరు పెట్టినట్లయితే 2,26,97,857 వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news