బంపర్ ఆఫర్.. 10 వేలు ఇన్వెస్ట్ చెయ్యండి.. 18 లక్షలు పొందండి..

-

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) అంటే మన దేశంలోనే చాలా నమ్మకమైన బీమా సంస్థ. పైగా ఇది దేశంలోనే అతిపెద్ద కేంద్ర ప్రభుత్వ బీమా కంపెనీ. ఇంకా అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థగా నిలిచింది.దీనిలో పాలసీ తీసుకోడానికి ఎక్కువ శాతం మంది ప్రజలు ఆసక్తి చూపుతారు. అందుకు తగినట్టుగానే ఎల్ఐసీ అన్ని వర్గాల వారికి కూడా అవసరమైన ప్లాన్లను తీసుకొస్తూ ఉంటుంది. కేవలం బీమా పథకాలను అందించడమే కాకుండా ఎన్నో పెట్టుబడి ప్రణాళికలను కూడా అందిస్తుంది. ఈ రోజు మనం అటువంటి స్కీం గురించి తెలుసుకుందాం.

ఈ స్కీం లో మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఇంకా అలాగే మీరు బీమా రక్షణ పొందవచ్చు. ఆ స్కీం పేరు ఎల్ఐసీ బీమా జ్యోతి ప్లాన్. ఈ ప్లాన్ వల్ల మొత్తం రెండు రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఆ ప్రయోజనాలు ఏంటి? ఈ పాలసీ ఎలా తీసుకోవాలి? వంటి పూర్తి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ ఎల్ఐసీ బీమా జ్యోతి ప్లాన్ మీకు పొదుపు ప్లస్ బీమా పథకాల ప్రయోజనాలను అందిస్తుంది. పైగా ఈ ప్లాన్ మీకు మరణ ప్రయోజనాన్ని(డెత్ కవర్) కూడా అందిస్తుంది. పాలసీ వ్యవధిలో పాలసీదారుడు మరణించిన సందర్భంలో, నామినీకి ప్రాథమిక డిపాజిట్‌లో 125% లేదా వార్షిక ప్రీమియంకు 7 రెట్లు అందుతుంది. ఈ పాలసీ టర్మ్ పూర్తయిన తర్వాత, పాలసీదారుకు ప్రాథమిక హామీ మొత్తంతో పాటుగా గ్యారెంటీ జోడింపులు కూడా అందుతాయి. మీరు ఈ స్కీంలో 10 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.10,000 కనుక డిపాజిట్ చేస్తే, 15 సంవత్సరాల తర్వాత మీకు ఏకంగా రూ.17 లక్షల 90 వేలు వస్తాయి.

ఇందులో 10 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 10,000 పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు ఈ పథకంలో మొత్తం రూ. 12 లక్షలు డబ్బుని పెట్టుబడి పెడతారు. అప్పుడు 15 సంవత్సరాల తర్వాత మీకు రూ. 17.9 లక్షలు లభిస్తాయి. ఈ విధంగా, రూ. 12 లక్షల పెట్టుబడి ప్రతి సంవత్సరం దాదాపు 7.5% రాబడిని మీకు ఇస్తుంది. ఈ ఎల్ఐసీ బీమా జ్యోతి ప్లాన్‌లో 90 రోజుల నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఎల్ఐసీ బీమా జ్యోతి ప్లాన్ కనీసం రూ. 1 లక్ష హామీ మొత్తం నుంచి ప్రారంభమవుతుంది. దీనికి గరిష్ట పరిమితి లేదు. ఎంత మొత్తం పై అయిన పాలసీని తీసుకోవచ్చు. మంచి ప్రయోజనాలు ఆశించే వారికి ఈ ప్లాన్ చాలా బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news