ఎల్ఐసీ సూపర్ ప్లాన్.. రూ.160 కడితే రూ.75 లక్షలు మీవే..

-

ఎల్ఐసీ ఎన్నో పథకాలను అందిస్తుంది.. అందులో కొన్ని పథకాలను ఎక్కువ డిమాండ్ ఉంటుంది.ఎల్ఐసీ అందిస్తున్న ప్లాన్స్‌లో న్యూ పెన్షన్ ప్లన్ కూడా ఒకటి..మీరు ఈ ప్లాన్‌లో చేరాలంటే ఒకసారి ప్రీమియం చెల్లించి చేరొచ్చు. లేదంటే రెగ్యులర్‌గా ప్రీమియం చెల్లిస్తూ ఉండొచ్చు. ఇలా రెండు ఆప్షన్లు ఉంటాయి. మీరు ఎంచుకున్న పాలసీ టర్మ్ వరకు ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి..ఈ పాలసీ టర్మ్ ముగిసిన తర్వాత వచ్చే మొత్తంలో 60 శాతాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తంలో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేస్తే సరిపోతుంది. ఈ స్కీమ్‌లో నాలుగు ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు ఉంటాయి. అవేంటంటే..పెన్షన్ గ్రోత్ ఫండ్, పెన్షన్ బాండ్ ఫండ్, పెన్షన్ సెక్యూర్డ్ ఫండ్, పెన్షన్ బ్యాలెన్స్డ్ ఫండ్ పాలసీలు..

ఇకపోతే ఈ పాలసీ కొనుగోలు చేయాలని భావించే వారు నెలకు రూ .5 వేలు కడితే ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చొ తెలుసుకుందాం. పెన్షన్ గ్రోత్ ఆప్షన్ ఎంచుకుంటే 20 ఏళ్లలో రూ. 23 లక్షలు పొందొచ్చు. ఇక్కడ 8 శాతం రిటర్న్ పరిగణలోకి తీసుకున్నాం. అదే 4 శాతం రిటర్న్ అయితే అప్పుడు రూ. 15 లక్షలు లభిస్తాయి. అదే 8 శాతం రాబడి ప్రకారం చూస్తే 35 ఏళ్లలో రూ. 75 లక్షలు లభిస్తాయి. అంటే రోజుకు రూ. 166 పొదుపు చేస్తే చాలు. 4 శాతం రాబడి అయితే రూ. 32 లక్షలు వస్తాయి..

అలాగే డబ్బులను పెంచుకుంటూ పోతే మీకు వచ్చే మొత్తం కూడా పెరుగుతుంది.. ఉదాహరణకు రూ.10 వేలు కడితే.. అప్పుడు 20 ఏళ్లలో రూ. 46 లక్షలు వస్తాయి. 8 శాతం రాబడి ప్రకారం ఈ మొత్తం వస్తుంది. అదే 4 శాతం రిటర్న్ అయితే రూ. 30 లక్షలు పొందొచ్చు.. అలాగే 80 సి కింద పన్ను మినహాయింపు కూడా ఉంది.. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news