MBU to launch High-Altitude Balloon Satellite: తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. నేడు మోహన్ బాబు యూనివర్సిటీలో నింగిలోకి బెలూన్ శాటిలైట్ ప్రయోగం నిర్వహించనున్నారు. NARL, IIST సహకారంతో విద్యార్థులు అభివృద్ధి చేసిన శాటిలైట్ ను నేడు మోహన్ బాబు యూనివర్సిటీలో నిర్వహించనున్నారు.
వాతావరణంలోని డయాక్పెడ్ స్థాయి, ఓజోన్ సాంద్రతలు, ఉష్ణోగ్రత, తేమ, వాతావరణ పీడనం పై పరిశోధనలు చేసేందుకు బెలూన్ శాటిలైట్ ప్రయోగం నిర్వహించనున్నారు. సుమారు 2 కేజీల బరువుతో 35 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోనుంది బెలూన్ శాటిలైట్. ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు ఎంబియు అధికారులు. ఇక ఇవాళ మోహన్ బాబు యూనివర్సిటీలో నింగిలోకి బెలూన్ శాటిలైట్ ప్రయోగం నిర్వహించనున్నారు. దీంతో అందరూ ఎంతో ఆసక్తి తో ఈ ప్రయోగం కోసం చూస్తున్నారు.