మహిళలకు మాత్రమే ఈ పాలసీ.. రోజుకు రూ. 50 కడితే రూ. 6లక్షలు

-

ఎల్‌ఐసీలో బోలెడు పాలసీలు ఉంటాయి. కానీ మనం ఏది తీసుకుంటున్నాం అన్నదే ముఖ్యం. ప్రీమియం తక్కువ ఉండాలి, రిటర్ ఎక్కువ రావాలి..హా అదేలా సాధ్యం అంటారా..? సాధ్యమే మరీ..! ఈ ఎల్‌ఐసీ పాలసీ గురించి తెలిస్తే మీరు ఇదే మాట అంటారు. ఈ పాలసీ దీని ద్వారా ఒకే సారి భారీ మొత్తం పొందొచ్చు. ఈ పాలసీ పేరు ఎల్ఐసీ ఆధార్ శిలా. ఈ ప్లాన్ కేవలం మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఎల్ఐసీ ఆధార్ శిలా స్కీమ్ నాన్ లింక్డ్ ఇండివీజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. పాలసీ దారుడు మరణిస్తే.. నామినీకి బీమా మొత్తం లభిస్తుంది. ఒకవేళ పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ సమయంలో ఒకేసరి డబ్బులు పొందొచ్చు. అందువల్ల ఈ ప్లాన్ ద్వారా రెండు రకాల బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. ఈ ప్లాన్ తీసుకోవాలని భావిస్తే.. 8 నుంచి 55 ఏళ్ల వరకు వయసు కలిగి ఉండాలి. 10 నుంచి 20 ఏళ్ల వరకు టెన్యూర్ ఉంటుంది. మీకు నచ్చిన టెన్యూర్‌తో పాలసీ తీసుకోవచ్చు.

కనీసం రూ. 75 వేల బీమా మొత్తానికి ఈ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే గరిష్టంగా రూ. 3 లక్షల వరకు మొత్తానికి ఈ పాలసీ తీసుకోవచ్చు. ఉదాహరణకు మీరు రూ. 3 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలని అనుకుంటే…మీ వయసు 30 ఏళ్లు అయితే అప్పుడు మీకు నెలకు దాదాపు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.900తో (రోజుకు దాదాపు రూ.30 పొదుపు చేయాలి) రూ. 3 లక్షలు పొందొచ్చు.

అలాగే మీ ఇంట్లో మీ కూతురి పేరుపై కూడా బీమా పాలసీ తీసుకోవాలని భావిస్తే.. అప్పుడు అదనపు ప్రీమియం కట్టాల్సి వస్తుంది. అంటే మీ కూతురి వయసు 15 ఏళ్లు అని అనుకుంటే.. అప్పుడు నెలవారీ ప్రీమియం రూ. 870 వరకు పడుతుంది. 20 ఏళ్ల టెన్యూర్ అయితే అప్పుడు మెచ్యూరిటీలో రూ. 3 లక్షలకు పైగా వస్తాయి. ఇలా నెలకు రూ.1570 ప్రీమియంతో (రోజుకు దాదాపు రూ.50) ఏకంగా రూ. 6 లక్షలు లభిస్తాయని చెప్పుకోవచ్చనమాట. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ఎల్‌ఐసీ ఏజెంట్‌ను సంప్రదించండి లేదా ఆన్‌లైన్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news