సురక్షితమైన వడ్డీని పొందాలంటే.. ఈ పోస్ట్ ఆఫీస్ స్కీం గొప్ప ఎంపిక..!

-

ఈ మధ్యకాలంలో రోజు రోజుకు ఖర్చులు పెరుగుతున్నాయి. దాని వలన పొదుపు చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో మొదలైంది అనే చెప్పవచ్చు. ఈ విధంగా ఆర్థిక క్రమశిక్షణ పెరగడం వలన ఎన్నో రకాలుగా పొదుపు చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే పొదుపు చేస్తారో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి రిటర్న్స్ వచ్చే మార్గాలను చూసుకోవాలి. వాటిలో పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కూడా మంచి ఎంపికగా చెప్పవచ్చు. పోస్ట్ ఆఫీస్ లో ఎన్నో రకాల స్కీమ్స్ అందుబాటులో ఉంటాయి. దానిలో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఎంతో మంచి ఎంపిక అనే చెప్పవచ్చు.

కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ను తీసుకురావడం జరిగింది. ఈ డిపాజిట్ స్కీమ్ లో ఎటువంటి రిస్క్ లేకుండా ఎంతో సురక్షితంగా రాబడిని పొందవచ్చు. అంతేకాకుండా, ఈ స్కీమ్ లో కేవలం వంద రూపాయల నుండి ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించవచ్చు మరియు ఖచ్చితమైన రిటర్న్ ను కూడా పొందవచ్చు. పైగా ఈ స్కీమ్ లో వచ్చే వడ్డీ కూడా స్థిరంగా ఉంటుంది. ఈ స్కీమ్ కు సంబంధించిన మెచ్యూరిటీ పీరియడ్ ఐదు సంవత్సరాలు. మధ్యలో స్కీమ్‌ ను విరమించుకుని డబ్బులను తీసుకోవాలంటే, మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత తీసుకోవచ్చు.

కాకపోతే దీనికి సంబంధించిన వడ్డీ తగ్గుతుంది లేదా తిరిగి లోన్ పొందవచ్చు. ఈ స్కీమ్‌కు అప్లై చేయడానికి, ముందుగా పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌కు సంబంధించిన ఫారం నింపాల్సి ఉంటుంది. దీని కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అందించాల్సి ఉంటుంది. దీనితో పాటుగా నామినీ పేర్లను కూడా నమోదు చేయాలి. ఈ విధంగా, స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత, డిపాజిట్ పీరియడ్ ఐదు సంవత్సరాలు తర్వాత ఇన్వెస్ట్ చేసిన రిటర్న్ మరియు వడ్డీని కూడా పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news