తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభ నేపథ్యంలో టిడిపి నేతలు వరుసగా మాట్లాడుతూ.. తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. కొంతమంది నాయకులు వైసిపి నాయకులపై, జగన్మోహన్ రెడ్డి తప్పిదాలపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ టిడిపి నాయకులు నన్నూరి నర్సిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మహానాడు సభలో ముక్కోడు అలాగే తిక్కోడు అంటూ కేసిఆర్ అటు జగన్మోహన్ రెడ్డి మీద వ్యంగ్యాస్త్రాలు సంధించారు నన్నూరి నర్సిరెడ్డి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మారింది. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో… తెలంగాణ టిడిపి నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి పై వైసీపీ అలాగే గులాబీ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.
మహానాడు సభలో ముక్కోడు, తిక్కోడు అంటూ కేసీఆర్, జగన్ మీద వ్యంగ్యాస్త్రాలు చేసిన తెలంగాణ టీడీపీ నాయకుడు నన్నూరి నర్సి రెడ్డి pic.twitter.com/Mcrs25L3Ds
— Telugu Scribe (@TeluguScribe) May 28, 2025