కేంద్ర ప్రభుత్వం ఇంటి కొనుగోలుదారులకు తీపికబురు..!

-

కొత్త బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి తీసుకు రావడానికి సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 1న దీనిని ప్రవేశ పెట్టబోతున్నారు. అయితే ఈసారి బడ్జెట్‌పై అంచనాలు చాలానే ఉన్నాయి. కేంద్రం ఇప్పుడున్న పరిస్థితులతో బడ్జెట్ ని ఎలా తీసుకు వస్తుందో అని అంతా చూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే బడ్జెట్ లో 2022-23లో ఇంటి కొనుగోలుదారులకు కూడా ఊరట కలిగే అంశాలు ఉండొచ్చని అంటున్నారు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ట్యాక్స్ డిడక్షన్ పరిమితిని పెంచచ్చని అంతా అంటున్నారు. ఇళ్ల డిమాండ్ పెంచాలనే లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద హోమ్ లోన్ చెల్లింపుపై వార్షిక ట్యాక్స్ డిడక్షన్ లిమిట్‌ను రూ. 2 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది రూ. 1.5 లక్షలుగా ఉంది. దీని వల్ల పన్ను చెల్లింపుదారులు సహా అటు దేశంలో హౌసింగ్ డిమాండ్ పెరుగుతుంది. ఇకపోతే సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా పొందొచ్చు.

అదే విధంగా రియల్ ఎస్టేట్ రంగానికి కూడా కేంద్రం శుభవార్త చెప్పేటట్టే వుంది. ఆఫర్డబుల్ హౌసింగ్ లోన్స్‌పై అదనంగా రూ.1.5 లక్షల వరకు వడ్డీ తగ్గింపు ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు అంటే మార్చి 2023 వరకు అందుబాటులో వుండే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news