మహబూబాద్ జిల్లాలో కొవిడ్ నిర్ధారణ అయిన వారికి వైద్య సేవలందిచేందుకు తగిన బెడ్స్ ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్యాధికారి డా.బి.హరీషరాజ్ తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో 70 బెడ్స్, తొర్రూరు UPHCలో 30, గూడూరు CHCలో 30, గార్ల CHCలో 30 కొవిడ్ బెడ్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రులైన అక్షయ ఆస్పత్రిలో 12, సాయిమల్టీ స్పెషాలిటీలో 57, మొత్తం 229 కొవిడ్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.