శుభవార్త.. ఇక నుండి ప్రతీ వారం జీతం పొందొచ్చు..!

-

దేశంలో వీక్లీ పే పాలసీ తీసుకొచ్చిన తొలి కంపెనీగా ఇండియామార్ట్ అవతరించింది. కరోనా కారణంగా చాలా కంపెనీలు ఉద్యోగులకి సరిగ్గా జీతం ఇవ్వడం లేదు. మరి కొన్ని చోట అయితే ఆలస్యంగా జీతాన్ని ఇస్తున్నారు. అందుకోసమే ఉద్యోగులకి ఇబ్బంది రాకూడదని వీక్లీ పేమెంట్ విధానాన్ని భారత్‌లోకి తీసుకొచ్చింది ఇండియామార్ట్.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఇక నుంచి జీతం కోసం ఉద్యోగులు నెల రోజుల పాటు ఎదురు చూడాల్సిన పని లేదు. ప్రతీ వారం కూడా ఈ ఉద్యోగులకి జీతం ఇస్తారు. దీనితో ఆర్ధిక భారం తగ్గుతుంది. అలానే మెరుగైన పనితీరు కనబర్చేందుకు ప్రోత్సాహం లభిస్తుందని అని కంపెనీ తెలిపింది. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ఇప్పటికే ఈ వీక్లీ పే పాలసీని ఫాలో అవుతున్నాయి.

దీని వలన పని తీరు బాగుంటోంది. అందుకోసమే ఇండియా మార్ట్ కూడా దేశంలో ఈ పేమెంట్ విధానాన్ని తీసుకు రావడం జరిగింది. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో మారుతోన్న పరిస్థితులు, పెరుగుతోన్న ఆర్థిక భారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పైగా కంపెనీలో ప్రతి ఒక్క ఉద్యోగి వీక్లీ పే పాలసీ తీసుకు రావడానికి అంగీకరించారని ఇండియామార్ట్ సీఓఓ తెలిపారు. దీనిని తీసుకు రావడం వలన వారి ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం తేలికవుతుందని అన్నర్రు.

 

Read more RELATED
Recommended to you

Latest news