స్మార్ట్‌ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్‌తో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ఫోన్లను విపరీతంగా వాడితే దాంతో రేడియేషన్ మనకు అనేక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. ముఖ్యంగా రేడియేషన్ వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మనకు మార్కెట్‌లో లభిస్తున్న అనేక రకాల కంపెనీలకు చెందిన ఫోన్లలో.. వేటిలో రేడియేషన్ స్థాయి ఎక్కువ ఉంటుందో, అసలు రేడియేషన్‌ను మనం ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..!
సాధారణంగా ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్‌ను SAR (Specific Absorption Rate)లో కొలుస్తారు. అంటే.. SAR విలువ ఎంత ఎక్కువ ఉంటే ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ స్థాయి అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ క్రమంలోనే ఏ ఫోన్‌లోనైనా అది వెలువరించే రేడియేషన్‌ను తెలుసుకోవాలంటే.. ఫోన్ డయలర్ ఓపెన్ చేసి అందులో *#07# అనే నంబర్‌ను డయల్ చేయాలి. దీంతో తెరపై ఆ ఫోన్ విడుదల చేసే రేడియేషన్ స్థాయికి చెందిన విలువ మనకు కనిపిస్తుంది. దీంతో ఆ ఫోన్ రేడియేషన్ ఎంతో మనం సులభంగా తెలుసుకుని ఆ మేర జాగ్రత్త పడవచ్చు. లేదా ఫోన్‌కు చెందిన బాక్సుపై కూడా ఆ ఫోన్ విడుదల చేసే రేడియేషన్ స్థాయి విలువను ప్రింట్ చేస్తారు. దాన్ని చూసినా ఆ ఫోన్‌కు చెందిన రేడియేషన్ స్థాయి మనకు తెలుస్తుంది. ఇక మనకు అందుబాటులో ఉన్న ఏ ఫోన్లలో అతి ఎక్కువ రేడియేషన్ విడుదల అవుతుందో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. షియోమీకి చెందిన ఎంఐ ఎ1 ఫోన్‌లో అతి ఎక్కువ రేడియేషన్ విడుదల అవుతుంది. దీని SAR value: 1.75
2. వన్ ప్లస్ 5టీ అతి ఎక్కువ రేడియేషన్‌ను విడుదల చేసే ఫోన్లలో రెండో స్థానంలో ఉంది. దీని SAR value: 1.68
3. అతి ఎక్కువ రేడియేషన్‌ను విడుదల చేసే ఫోన్లలో షియోమీ ఎంఐ మ్యాక్స్ 3 ది మూడో స్థానం. దీని SAR value: 1.58
ఇక తరువాతి స్థానాల్లో వరుసగా వన్‌ప్లస్ 6టి ( SAR value: 1.55), హెచ్‌టీసీ యూ12 లైఫ్ (SAR value: 1.48)లు నిలిచాయి. అలాగే అతి తక్కువ రేడియేషన్‌ను విడుదల చేసే ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 (SAR value: 0.17) మొదటి స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో వరుసగా జడ్‌టీఈ ఆగ్జాన్ ఎలైట్ (SAR value: 0.17), ఎల్‌జీ జీ7 (SAR value: 0.24), గెలాక్సీ ఎ8 (SAR value: 0.24), శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్ (SAR value: 0.26) ఫోన్లు నిలిచాయి.