ఎక్కువ వడ్డీని పొందాలంటే ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ బెస్ట్..!

-

చాలా మంది ఏదైనా మంచిగా డబ్బులు వచ్చే స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటారు. అయితే ఫిక్సెడ్ డిపాజిట్స్ కంటే కూడా ఈ స్కీమ్స్ లో రాబడి బాగుంటుంది. FD కంటే మీ పెట్టుబడిపై ఎక్కువ రాబడిని పొందాలనుకుంటే కిసాన్ వికాస్ పత్ర, నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికేట్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ సేవింగ్‌ పథకం బెస్ట్. పైగా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

post offcie
post offcie

కిసాన్ వికాస్ పత్ర:

ఈ స్కీమ్ నుండి 6.9% వడ్డీ చెల్లిస్తున్నారు. కనీసం వేయి రూపాయాలు నుండి ఇన్వెస్ట్ చెయ్యచ్చు. లిమిట్ అంటూ ఏమి లేదు. వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. సింగిల్ అకౌంట్‌ ని కానీ జాయింట్ అకౌంట్ ని కానీ ఓపెన్ చెయ్యచ్చు. డబ్బులకోసం కనీసం 2.5 సంవత్సరాలు వేచి ఉండాలి. దీని లాక్-ఇన్ పీరియడ్ రెండున్నరేళ్లు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్:

దీనిలో డబ్బులు పెడితే ఏ రిస్క్ ఉండదు. పెట్టుబడికి 6.8% వార్షిక వడ్డీ లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం 80సీ కింద రూ.1.5 లక్షల వరకు డిపాజిట్లపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. ఈ అకౌంట్ ని ఓపెన్ చెయ్యడానికి మీరు కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మాక్సిమం ఎంతైనా ఈ స్కీమ్ లో పెట్టచ్చు. డబ్బు రెట్టింపు కావడానికి 10 సంవత్సరాల 7 నెలల సమయం పడుతుంది.

మంథ్లీ ఇన్కమ్ స్కీమ్:

మీకు ఒకే ఖాతా ఉంటే మీరు గరిష్టంగా రూ.4.5 లక్షలు డిపాజిట్ చెయ్యచ్చు. కనీసం రూ.1000తో ఖాతా తెరవవచ్చు. జాయంట్ అకౌంట్ కనుక ఉంటే గరిష్టంగా రూ.9 లక్షలు పెట్టచ్చు. మెచ్యూరిటీ వ్యవధి 5 ​సంవత్సరాలు. అలానే ఈ ఖాతాను మైనర్ పేరు మీద తెరవవచ్చు 3 పెద్దల పేరుతో ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. 6.6% వడ్డీని ఈ స్కీమ్ ద్వారా పొందొచ్చు. డబ్బు రెట్టింపు కావడానికి 10 సంవత్సరాల 11 నెలల సమయం పడుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news