ఉద్యోగులకి బ్యాడ్ న్యూస్…టీఎ పెంపు లేనట్టే..!

-

టీఎ పెంపు ఇంకా లేనట్టు తెలుస్తోంది. అయితే గతం లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. డియర్‌నెస్ అలవెన్స్ DA జూలై నుంచి చెల్లిస్తామని చెప్పడం జరిగింది. డీఏ తో పాటు ట్రావెల్ అలవెన్స్ TA కూడా పెరుగుతుందని పలు నివేదికలు పేర్కొన్నాయి.

దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే.. ప్రస్తుత డీఏ 25 శాతం లేదా అంత కన్నా ఎక్కువ లేదు. 7వ వేతన కమిషన్ పే మెట్రిక్స్ ప్రకారం.. 2021 జూలై నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు టీఏ పెరగదు అని తెలుస్తోంది. ఎందుకు అంటే ప్రస్తుతం డియర్‌నెస్ అలవెన్స్ 17 శాతం గానే ఉంది.

డీఏ పెరుగుదల తో పాటు టీఏ కూడా పెరుగుతుంది అని మొదట కేంద్రం అంది. డీఏ 25 శాతం లేదా అంత కన్నా ఎక్కువగా ఉన్నప్పుడే ఇది జరుగుతుంది కనుక ప్రస్తుతం ఉద్యోగుల డీఏ 17 శాతం గానే ఉంది.

దీని మూలంగా డీఏ తో పాటు టీఏ పెరిగే అవకాశం లేదని అంటున్నారు నిపుణులు. జూలై నుంచి డిసెంబర్ కాలానికి కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపును ప్రకటిస్తే.. అప్పుడు టీఏ పెరిగే అవకాశముందని తెలిపారు. దీనితో ఇంకా ఉద్యోగులకి అనుకున్నట్టు టీఏ పెరగదు.

Read more RELATED
Recommended to you

Latest news